Breaking News

ధురంధర్‌: ది రివెంజ్‌ @ 1622 కోట్లు

Published on Tue, 04/07/2026 - 00:13

‘ధురంధర్‌: ది రివెంజ్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. నార్త్‌ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన భారతీయ చిత్రంగా ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ నిలిచింది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్యధర్‌ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘ధురంధర్‌’. ఆర్‌. మాధవన్, అర్జున్‌ రాంపాల్, సంజయ్‌ దత్, సారా అర్జున్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్‌ పతాకాలపై ఆదిత్యధర్, జ్యోతిదేశ్‌ పాండే, లోకేష్‌ థర్‌ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా (ధురంధర్, ధురంధర్‌: ది రివెంజ్‌) విడుదలైంది.

గత ఏడాది డిసెంబరు 5న విడుదలైన ‘ధురంధర్‌’ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1400 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ ఏడాది మార్చి 19న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ సినిమా 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1622 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను కొల్లగొట్టిందని యూనిట్‌ పేర్కొంది. ఇండియాలో రూ.1228 కోట్లు, ఓవర్సీలో రూ.394 కోట్లు తమ సినిమాకు వచ్చాయని ‘ఎక్స్‌’ వేదికగా జియో స్టూడియోస్‌ సంస్థ తెలిసింది.

ఇండియాలో రూ.1041 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ వచ్చాయని, ఇక్కడ వెయ్యికోట్ల రూపాయల నెట్‌ వసూళ్లు సాధించిన రికార్డును ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ క్రియేట్‌ చేసిందని మేకర్స్‌ చెబుతున్నారు. ఇటీవలే నార్త్‌ అమెరికాలో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ వసూళ్ల రికార్డును అధిగమించిన ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ సినిమా తాజాగా నార్త్‌ అమెరికాలో పాతిక మిలియన్‌ డాలర్లు(దాదాపు 232 కోట్లు) సాధించి, అక్కడ అత్యధిక కలెక్షన్స్‌ను సాధించిన తొలి ఇండియన్‌ సినిమాగా నిలిచిందని మేకర్స్‌ పేర్కొన్నారు. అలాగే జర్మనీ బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా వన్‌ మిలియన్‌ యూరోలు సాధించి సత్తా చాటింది.

Videos

శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..

మావిగన్ పేరెత్తగానే ఎందుకు అంత భయపడుతున్నారు?

RK అక్షర వ్యభిచారం..! శవాలపై చిల్లర ఏరుకోడానికి కూడా సిద్ధం

చంద్రబాబు నోటికి ప్లాస్టర్ రెచ్చిపోతున్న దగ్గుబాటి ప్రసాద్..

పచ్చ నేతల రౌడీయిజం 3 కోట్ల NRI భూమి కబ్జా

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

శత్రుదేశంలో ఉన్న పైలట్ ను ఎలా కాపాడారు.. ఎన్ని ఆయుధాలు వాడారంటే

RBI బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఎఫ్ డీలకు మించి వడ్డీ..!

జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్

Photos

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)