Breaking News

ఓటీటీలో దురంధర్‌-2.. మూడు రోజుల్లోనే రికార్డ్..!

Published on Tue, 06/09/2026 - 20:00

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్‌-2. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఏకంగా రూ.1790 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన పుష్ప-2 రికార్డ్‌ను సైతం అధిగమించింది. 
  
ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జూన్ 5న స్ట్రీమింగ్‌కు వచ్చేసిన దురంధర్‌-2 వ్యూస్ పరంగా అదరగొడుతోంది. స్ట్రీమింగ్‌కు వచ్చిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల మందికిపైగా వీక్షించారు. కేవలం వీకెండ్‌లోనే  5 కోట్ల మందిపైగా వీక్షించినట్లు ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌ ప్రకటించింది. ఈ మూవీ ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సారా అర్జున్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా, డానిష్ పాండోర్ కీలక పాత్రలు పోషించారు.

 

 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)