Breaking News

ధురంధర్-2 ఫస్ట్‌ డే కలెక్షన్స్‌..

Published on Fri, 03/20/2026 - 09:26

‘ధురంధర్ 2’ ఫస్ట్‌ డే బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ సునామి సృష్టించింది. స్ట్రీ 2, జవాన్, యానిమల్ వంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టి, బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 18 నుంచే ప్రీమియర్ షోలతో థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఫస్ట్ డే  ‘ధురంధర్ 2’ కలెక్షన్స్‌ దుమ్మురేపింది. భారతీయ చిత్ర పరిశ్రమలో 'పుష్ప-2' తర్వాత భారీ ఓపెనింగ్స్ రాబట్టిన  సినిమాగా ధురంధర్‌2 నిలిచింది. గతేడాదిలో విడుదలైన ‘పార్ట్‌-1’ తొలిరోజు కలెక్షన్లు రూ.28.60 కోట్ల (నెట్‌) రాబట్టిన విషయం తెలిసిందే.

ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్‌తో కలిసి  ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. నెట్‌ పరంగా అయితే రూ. 145.55 కోట్లు అని ఆ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో నెట్ కలెక్షన్లలో రూ.100 కోట్లు దాటిన మొదటి హిందీ సినిమాగా ధురంధర్- 2 నిలిచింది. కేవలం హిందీ నుంచే ఈ సినిమాకు రూ.103 కోట్ల నెట్ కలెక్షన్లు రావడం విశేషం. ఇప్పుడు వరసు సెలవులు ఉండటంతో ఫస్ట్‌ వారంలోనే రూ. 700 కోట్ల మార్క్‌ను సులువుగా దాటుతుందని అంచనా వేస్తున్నారు.

‘ధురంధర్‌: ది రివెంజ్‌’ ప్రీమియర్స్‌తోనే హిట్‌ టాక్‌ తెచ్చుకోవడం ఆపై  ఉగాది, రంజాన్‌ వంటి పండుగల సెలవులు ఉండటంతో ఈ మూవీకి కలిసిసొస్తుంది. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.  మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ యాక్టర్స్‌ ఈ మూవీకి మరింత బలాన్ని చేకూర్చింది. ప్రస్తుతం ‘ధురంధర్ 2’కు వస్తున్న ఆదరణ చూస్తుంటే కలెక్షన్స్‌ పరంగా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Videos

YSRCP బూత్ కమిటీ సమావేశం.. నేతలకు RK రోజా సూచన

నో స్టాక్.. పెట్రోల్ బంకులు క్లోజ్

నారా కాస్త నీరో లోకేష్ అయ్యాడు..లోకేష్ పై నిప్పులు చెరిగిన తాటిపర్తి

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

భారీగా పతనమైన రూపాయి విలువ

ఫైనల్ షాట్..హర్మూజ్ లోనే అమీ తుమీ

మీరు చేస్తే సంసారం.. పక్కవాడు చేస్తే వ్యభిచారం పోలీస్ వ్యవస్థ, చంద్రబాబు పై జాడ శ్రవణ్ నిప్పులు

విమానంలో 11 ఏళ్లుగా పలు సాంకేతిక సమస్యలున్నాయి

కాంగ్రెస్ సర్కార్ రోజుకో స్కాం అసెంబ్లీలో మొత్తం బయటపెడతా

మాతో పెట్టుకోవద్దు.. పాక్‌కు ఆఫ్ఘన్ ప్లేయర్ వార్నింగ్

Photos

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)

+5

పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు (ఫొటోలు)

+5

విజయవాడ : సెలవులు, పండుగ వచ్చేసింది.. బస్టాండ్‌లో విద్యార్థులు, ప్రయాణికుల రద్దీ (ఫొటోలు)