అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచిన ‘దురంధర్‌’.. 900 మంది కూడా చూడలేదు!

Published on Tue, 07/14/2026 - 13:50

ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన రన్‌వీర్ సింగ్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' జపాన్ మార్కెట్‌లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు భాగాలు కలిపి ఏకంగా రూ. 3,100 కోట్లకు పైగా వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ ఫ్రాంచైజీకి, జపాన్ ప్రేక్షకులు ఊహించని షాక్ ఇచ్చారు. భారీ రిలీజ్, పబ్లిసిటీ చేసినప్పటికీ.. మొదటి రోజు థియేటర్లకు కనీసం వెయ్యి మంది కూడా రాకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

తొలి రోజు కేవలం 900 మంది లోపే..!
స్థానిక పంపిణీ సంస్థ ‘ట్విన్’ (Twin) ద్వారా జపాన్‌ వ్యాప్తంగా దాదాపు 80 స్క్రీన్లలో జూలై 10న ‘ఆపరేషన్ ధురంధర్’ పేరుతో ఈ చిత్రం విడుదలైంది. అయితే జపనీస్ బాక్సాఫీస్ ట్రాకర్ ‘మిమోరిన్’ గణాంకాల ప్రకారం విడుదలైన రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు 57 ప్రదేశాలలో కలిపి కేవలం 449 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. సాయంత్రానికి థియేటర్ల సంఖ్య 80కి పెరిగినప్పటికీ ఆదరణలో ఎలాంటి మార్పు లేదు. మొదటి రోజు మొత్తం మీద 900 మంది ప్రేక్షకులు మాత్రమే సినిమాను వీక్షించారు.

భారీ ప్రచారం చేసినా ఫలితం శూన్యం
రిలీజ్‌కు ముందు జపనీస్ ఆడియన్స్‌ను ఆకర్షించేందుకు చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించింది. రన్‌వీర్ సింగ్ స్వయంగా ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ‘ఇది భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ చిత్రం’ అంటూ ప్రమోట్ చేశారు. అయితే ఈ సినిమాను కేవలం జపనీస్ సబ్‌టైటిల్స్‌తోనే రిలీజ్ చేశారు. డబ్బింగ్ వెర్షన్ లేకపోవడం వల్లే జపాన్ ప్రేక్షకులు ఈ సినిమా వైపు పెద్దగా మొగ్గు చూపలేదని సోషల్ మీడియా టాక్.

కాగా, జపాన్‌లో మొదటి రోజు అత్యధిక అడ్మిషన్లు సాధించిన భారతీయ చిత్రంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ పంపిణీ చేసిన ‘RRR’ (8,230 అడ్మిషన్లతో) ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన ‘పుష్ప 2’ కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)