Breaking News

తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?

Published on Fri, 03/20/2026 - 15:37

ప్రస్తుతం దేశంలో 'ధురంధర్ 2' గురించి చర్చ గట్టిగానే నడుస్తోంది. సీక్వెల్‌ అయిన ఈ చిత్రం.. రెండు రోజుల క్రితం ప్రీమియర్లతో థియేటర్లోకి వచ్చింది. రిలీజ్‌కి ముందు బీభత్సమైన హైప్ ఏర్పడింది. దర్శకుడు ఆదిత్య ధర్ దాన్ని నిలబెట్టుకున్నాడు. 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఏ మాత్రం బోర్ కొట్టకుండా మ్యాజిక్ చేశాడు. ఈ చిత్రానికి మూడో భాగం ఉంటుందనే రూమర్ కొన్నిరోజుల ముందు వరకు వినిపించింది. కానీ 'ధురంధర్ 2' రిలీజైన తర్వాత అలాంటిదేం లేదని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు)

అయితే 'ధురంధర్' ఫ్రాంచైజీని పూర్తి చేసిన దర్శకుడు ఆదిత్య ధర్.. తర్వాత ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నాళ్ల క్రితం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'అశ్వద్ధామ' గురించి అల్లు అర్జున్‌తో ఆదిత్య చర్చలు జరిపాడనే టాక్ బయటకొచ్చింది. తర్వాత దీని అప్‌డేట్ ఏం లేదు. అయితే 'ధురంధర్ 2' ప్రీమియర్ చూసిన వెంటనే అల్లు అర్జున్.. సినిమాని పొగుడుతూ ట్వీట్ చేయడం, ఆదిత్యని ఆకాశానికెత్తేయడం చూస్తుంటే త్వరలో కలిసి పనిచేస్తారా అనే సందేహం వస్తోంది.

ఇందులో అల్లు అర్జున్ మెయిన్ హీరో అయినప్పటికీ ఎన్టీఆర్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తాడని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం టాలీవుడ్‌లో వచ్చే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇది నిజమా కాదా అనేది తెలియడానికైనా మరికొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే 2019లో 'ఉరి' రిలీజ్ చేసిన ఆదిత్య ధర్.. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత 'ధురంధర్' రెండు భాగాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి తర్వాత మూవీ ఎన్నేళ్లకు వస్తుందనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్.

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో చూసుకుంటే 'పుష్ప'తో బన్నీ, 'ఆర్ఆర్ఆర్' తారక్ రేంజ్ చాలా పెరిగింది. ప్రస్తుతం వీళ్లు చేస్తున్న ప్రాజెక్టుల స్పాన్ కూడా పెద్దదే. ఒకవేళ కాలం కలిసొచ్చి ఆదిత్య.. అల్లు అర్జున్-ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ తీస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ గ్యారంటీ.

(ఇదీ చదవండి: ‘ధురంధర్‌ 2’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Videos

రికార్డులు బద్దలు! ధురంధర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ సునామి..

బిగ్ అలర్ట్.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు

YSRCP బూత్ కమిటీ సమావేశం.. నేతలకు RK రోజా సూచన

నో స్టాక్.. పెట్రోల్ బంకులు క్లోజ్

నారా కాస్త నీరో లోకేష్ అయ్యాడు..లోకేష్ పై నిప్పులు చెరిగిన తాటిపర్తి

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

భారీగా పతనమైన రూపాయి విలువ

ఫైనల్ షాట్..హర్మూజ్ లోనే అమీ తుమీ

మీరు చేస్తే సంసారం.. పక్కవాడు చేస్తే వ్యభిచారం పోలీస్ వ్యవస్థ, చంద్రబాబు పై జాడ శ్రవణ్ నిప్పులు

విమానంలో 11 ఏళ్లుగా పలు సాంకేతిక సమస్యలున్నాయి

Photos

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)

+5

పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు (ఫొటోలు)