థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
దురంధర్ నటుడికి జాక్‌పాట్.. జూనియర్ ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్..!
Published on Fri, 04/03/2026 - 16:22
రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ మూవీ రిలీజైన వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించింది. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. కేవలం 15 రోజుల్లోనే రూ.1501 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం మూడు నెలల్లోనే సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దురంధర్ టీమ్‌కు ఎక్కడా లేని క్రేజ్‌ను తెచ్చిపెడుతోంది. ఈ సినిమాలో నటించిన వారికి ఆదరణ ఓ రేంజ్‌లో వస్తోంది. తాజాగా ఓ దురంధర్ నటుడికి ఏకంగా టాలీవుడ్ ఛాన్స్ తీసుకొచ్చింది దురంధర్. ఈ మూవీలో నటించిన బిమల్ ఒబెరాయ్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తోన్న డ్రాగన్ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. టోవినో థామస్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో బిమల్‌కు అవకాశమొచ్చినట్లు తెలుస్తోంది.
కాగా.. బిమల్ ఓబెరాయ్ దురంధర్‌లో బలోచ్ యునైటెడ్ ఫోర్స్ లీడర్ శ్రీరాని బలోచ్ పాత్రలో మెప్పించారు. ఈ పాత్ర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సీరియస్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో బిమల్ ఆడియన్స్‌ను అలరించారు. తాజాగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్టీఆర్ మూవీలో ఎలాంటి రోల్ చేస్తారన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
#Dhurandhar fame #BimalOberoi aka #ShiraniBaloch has been roped in by #PrashanthNeel for #Dragon. 🔥#NTR
pic.twitter.com/kqkYsg3myv— Milagro Movies (@MilagroMovies) April 3, 2026
Tags : 1