రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. జగన్ ట్వీట్
Breaking News
పనిమనిషిపై పదేళ్లుగా అత్యాచారం.. 'ధురంధర్' నటుడు అరెస్ట్
Published on Mon, 01/26/2026 - 11:31
బాలీవుడ్ హిట్ సినిమా ధురంధర్‌తో పాపులర్ అయిన నటుడు నదీమ్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు పదేళ్లుగా తన ఇంటి పనిమనిషిపై అత్యాచారం, లైంగిక దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాదితురాలే స్వయంగా మాల్వాణి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అనేకసార్లు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ధురంధర్‌లో అక్షయ్ ఖన్నా (రెహమాన్ దకైత్) వంటవాడిగా అఖ్లాక్ పాత్రతో నదీమ్ కనిపించాడు. నదీమ్ తనను మానసిక వేధింపులకు గురిచేశాడని బాధితురాలు పేర్కొంది. తనపై భయంతోనే ఈ విషయాన్ని ఇన్నేళ్లు దాచినట్లు ఆమె తెలిపింది. పెళ్లి చేసుకోవాలని అనేకసార్లు నేను కోరడంతో దాటవేస్తూ వచ్చాడని ఆమె పేర్కొంది. నదీమ్ మిమి (2021), వాధ్ (2022), మై లడేగా (2024) వంటి చిత్రాల్లో కూడా నటించాడు. అమితాబ్ బచ్చన్‌తో కలిసి కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో కూడా నదీమ్ పాల్గొన్నాడు.
Tags : 1