Breaking News

‘ధురంధర్‌2’కి పెయిడ్‌ ప్రీమియర్స్‌.. రన్‌టైమ్‌ ఎంతంటే?

Published on Sat, 03/07/2026 - 15:52

రణ్‌వీర్‌ సింగ్‌  హీరోగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ధురంధర్2: ది రివెంజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజ్‌ అయిన ట్రైలర్‌ ఆ అంచనాలు డబుల్‌ చేసింది. యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌ డ్రామాకు కూడా పెద్ద పీట వేసినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. మార్చి 19న బాక్సాఫీస్‌ బద్దలు అవ్వడం ఖాయమని రణ్‌వీర్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. అయితే చిత్రబృందం మాత్రం ఒక రోజు ముందే బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి 18న పెయిడ్‌ ప్రీమియర్స్‌ వేయబోతున్నారు. ఆ రోజు సాయంత్రం ఫస్ట్‌ షో నుంచే ‘ధురంధర్‌2: ది రివెంజ్‌’ మూవీని ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే బుక్‌మై షో, డిస్ట్రిక్ట్‌ యాప్‌ల ద్వారా టికెట్‌ బుకింగ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ పెయిడ్‌ ప్రీమియర్స్‌కి మాత్రం కేవలం హిందీ భాషలో మాత్రమే బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి.  

హైదరాబాద్‌లోని వివిధ మల్టీప్లెక్స్‌లలో ఇప్పటికే టికెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. మామలుగా అయితే పెయిడ్‌ ప్రీమియర్స్‌కి టికెట్‌ ధరలను పెంచుతారు. కానీ ధురంధర్‌ 2కి మాత్రం ప్రీమియర్స్‌కి కూడా నార్మల్‌ ధరలే ఉండడం గమనార్హం. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్స్‌కి రావడం కోసమే మేకర్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారీ రన్‌టైమ్‌..
ధురంధర్‌ 2 మూవీ రన​్‌టైమ్‌పై మొన్నటి వరకు సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. ఈ మూవీ నిడివి 3 గంటల 55 నిమిషాలు.  మొదటి భాగం 3 గంటలా 34 నిమిషాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. బ్రేక్‌ టైమ్‌తో కలిపితే నాలుగు గంటలకు పైనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంత నిడివితో ఏ చిత్రం రాలేదు.  ప్రేక్షకుడిని ఎంగేజ్‌ చేసే కంటెంట్‌ ఉంది కాబట్టే.. రన్‌టైమ్‌ విషయంలో మేకర్స్‌ భయపడడం లేదట. మరి ధురంధర్‌ 2 ఎన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు