ఎండలను కంట్రోల్ చేస్తా.. వాట్ ఈజ్ దిస్ విడ్డూరం
Breaking News
దూసుకెళ్తోన్న దురంధర్-2.. కేవలం మూడు రోజుల్లోనే అన్ని కోట్లా?
Published on Sun, 03/22/2026 - 09:19
రణ్‌వీర్‌సింగ్ హీరోగా వచ్చిన దురంధర్-2 హవా కొనసాగుతోంది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా రూ.501 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్‌తో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది.
నెట్ వసూళ్ల పరంగా చూస్తే మూడు రోజుల్లోనే రూ.రూ. 339.27 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు అత్యధికంగా రూ.113 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. కేవలం మూడో రోజు వసూళ్లతోనే హిందీ సినిమా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. ఓవర్‌సీస్‌లోనూ దురంధర్-2 దూసుకెళ్తోంది.
ఉత్తర అమెరికాలో 'ధురంధర్ 2' ఏకంగా 4,405 షోలు ప్రదర్శిస్తున్నారు. ఒక ఇండియన్ సినిమా ఇంత భారీ స్థాయిలో విడుదల కావడం ఇదే మొదటిసారి. మూడో రోజు కూడా రెండు లక్షలకు టికెట్లకు పైగా విక్రయించారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారానే సుమారు రూ.23.70 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ వసూళ్లను చూస్తే ఉత్తర అమెరికా మార్కెట్‌లో ఒక ఇండియన్ మూవీ ఒక్క రోజులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'ధురంధర్ 2' నిలవనుంది. యూకేలోనూ దురంధర్-2 షోలు హౌస్‌పుల్‌గా రన్ అవుతున్నాయి. బెల్ఫాస్ట్ నగరంలో ఏడు షోలు హౌస్‌పుల్‌గా ప్రదర్శించారు. ఇదే జోరు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా రూ. 2 వేల కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags : 1