Breaking News

బ్రేకప్‌పై ధృవ్ విక్రమ్‌ పరోక్ష స్పందన.. ఏమన్నాడంటే?

Published on Mon, 08/17/2026 - 23:24

అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన జీవితంలో నుంచి ఓ వ్యక్తి దూరమయ్యాడని, ఇప్పుడు తాను స్వేచ్ఛగా ఉన్నానంటూ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ నటుడు, సీనియర్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్ విక్రమ్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

ధృవ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. సినీ రంగంలో ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలపై నిశిత పరిశీలన, విమర్శలు సహజమే. వాటిని తట్టుకుని వన్‌ మ్యాన్‌ ఆర్మీలా ముందుకు సాగాలి. ప్రతి నటుడి జీవితంలో నెగెటివ్ అంశాలు కూడా ఉంటాయి. అయితే వాటిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. తమపై వచ్చే విమర్శలు ఇబ్బంది పెట్టినప్పటికీ.. వాస్తవానికి, తన విలువలకు కట్టుబడి ఉండటం ముఖ్యం. నిజాయితీగా ఉంటే ఎలాంటి విమర్శలు తనను ప్రభావితం చేయలేవని తెలిపాడు.

అయితే ధృవ్ తన వ్యాఖ్యల్లో అనుపమ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఆయన వ్యాఖ్యలు అనుపమ చేసిన పరోక్ష వ్యాఖ్యలకు స్పందనగానే భావిస్తున్నారు.

అనుపమ స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తమిళంలోనూ పలు మూవీస్ చేసింది. అయితే ధ్రువ్‌తో 'బైసన్' సినిమా చేస్తున్న టైంలో హీరోహీరోయిన్లు అయిన ధ్రువ్ విక్రమ్, అనుపమ మధ్య ప్రేమ పుట్టిందనే టాక్ బయటకు వచ్చింది. అందుకు తగ్గట్లే కొన్ని వ్యక్తిగత ఫొటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే ఇది నిజమా కాదా అనే సంగతి పక్కనబెడితే లేటెస్ట్‌గా అనుపమ.. బ్రేకప్ తర్వాత తనకు స్వాతంత్రం వచ్చిందనే అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ పెట్టింది.

ఇక మరో పోస్టులో.. ఈ రోజు  ప్రశాంతత నన్ను చేరుకుంది. ఒకప్పుడు నాదేనని మరిచిపోయిన జీవితాన్ని మరోసారి ప్రేమించడం ప్రారంభించా. మీ అందరినీ నేను ఎంతో ప్రేమిస్తున్నా. ఇకపై నా జీవితం పూర్తిగా నాదే అని రాసుకొచ్చింది. దీంతో అనుపమ బ్రేకప్ రూమర్స్ నిజమేనా అని మాట్లాడుకుంటున్నారు.

ఇక అనుపమ సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్యే 'మరీచిక', లాక్ డౌన్ లాంటి సినిమాలతో వచ్చింది గానీ ఫ్లాప్స్ ఎదుర్కొంది. ప్రస్తుతం శర్వానంద్ సరసన 'భోగి' మూవీ చేస్తోంది. 

Videos

దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..?

మహిళతో TDP నేత సంచలన ఆడియో లీక్

రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్

సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు

కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?

పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం దొరకడంపై YS జగన్ ఫైర్

చింతాడ రవికుమార్ కు బెయిల్

బీజేపీ కొత్త టీమ్ ఇదే..! DK అరుణ, లక్ష్మణకు బిగ్ షాక్

PV సింధుని 384 మంది ఫేక్ వాళ్లతో పోల్చటం సిగ్గుచేటు

తొక్కిసలాటకు ముందు ఉజ్జయిని మహంకాళి ఆలయం డ్రోన్ విజువల్స్

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)

+5

18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)

+5

న్యూయార్క్‌ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)

+5

కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)

+5

చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)

+5

వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్‌ (ఫొటోలు)

+5

‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

బండ్ల గణేశ్‌ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)