Breaking News

చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్

Published on Tue, 06/10/2025 - 15:41

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక. పుష్ప 2, ఛావా లాంటి సినిమాలతో వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈమె.. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈమె నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో మాట్లాడుతూ ధనుష్.. రష్మిక గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో తాను బిచ్చగాడు పాత్ర చేశానని, ఓసారి డంప్ యార్డ్‌లో దాదాపు ఆరేడు గంటలు షూటింగ్ చేయాల్సి వచ్చిందని ధనుష్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తామంతా చెత్త నుంచి వచ్చే కంపుతో ఇబ్బంది పడుతుంటే.. రష్మిక మాత్రం నాకేం వాసన రావడం లేదు అని చెప్పేది. దీంతో ఆశ్చర్యపోవడం మా వంతైందని ధనుష్ అన్నాడు. అలానే 'కుబేర'.. జీవితంలోని మరో కోణాన్ని తనకు పరిచయం చేసిందని, చిన్ననాటి రోజుల్ని గుర్తుచేసిందని చెప్పాడు.

(ఇదీ చదవండి: డిజాస్టర్ 'థగ్ లైఫ్'.. ఓటీటీ లెక్క మారుతోంది!)

ఇదే సినిమాలో కీ రోల్ చేసిన నాగార్జున మాట్లాడుతూ.. రష్మికని ఆకాశానికెత్తేశాడు. టాలెంట్‌లో ఈ అమ్మాయి పవర్ హౌస్ అంటూ పొగిడేశాడు. అలానే హీరోగా ఎందుకు చేయట్లేదంటే తనకు నచ్చే స్టోరీలు రావట్లేదని అన్నాడు. శేఖర్ కమ్ములు ఈ స్క్రిప్ట్‌తో తన దగ్గరకు రాగానే విని ఓకే చేశానని చెప్పుకొచ్చాడు. త్వరలో 'కూలీ'తో మరోసారి హిందీ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నానని కూడా చెప్పాడు.

శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర'.. ఆయన గత చిత్రాలతో పోలిస్తే సమ్‌థింగ్ ఉండబోతుంది. కొన్నిరోజుల క్రితం రిలీజైన టీజర్ చూస్తే ఈ విషయం చాలామందికి అర్థమైంది. కాకపోతే ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు ఇది యాక్షన్ మూవీ కాదు. డబ్బు, దాని వల్ల వచ్చే అనర్ధాలు తదితర అంశాలతో సినిమాని తీసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి 'కుబేర'.. బిగ్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో?

(ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. ఎవరో తెలుసా?)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)