ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం
Breaking News
బ్యాంక్ దొంగగా ధనుష్.. ఆసక్తికరంగా ట్రైలర్
Published on Sun, 04/19/2026 - 20:35
ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతోంది. పెట్రోలు ఉత్పత్తి అయ్యే చోట్ల ఇరాన్ దాడులు చేయడం లాంటివి చూశాం. ఈ అంశాన్ని ఓ పాయింట్‌గా చూపించి తీసిన సినిమా 'కర'. ధనుష్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈనెల 30న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంటూ మూవీపై అంచనాల్ని పెంచేస్తోంది.
(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ కోసం ఊహించని హీరోయిన్?)
ట్రైలర్ బట్టి చూస్తే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఓ పల్లెటూరిలో ఉండే హీరో.. బ్యాంకు దొంగతనాలు చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో వాటిని ఆపేసి పెళ్లి చేసుకుని సాధారణంగా బతుకుతుంటాడు. అలాంటి ఇతడు మళ్లీ ఎందుకు దొంగతనాలు చేయాల్సి వచ్చింది. ఇతడిని అడ్డుకునేందుకు పోలీస్(సూరజ్ వెంజరమూడు) ఏం చేశాడనేదే స్టోరీలా అనిపిస్తుంది.
గతంలో 'పొర్ తొళిల్' అనే థ్రిల్లర్ తీసి అద్భుతమైన హిట్ కొట్టిన విఘ్నేశ్ రాజా.. ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఇది థియేటర్లలోకి రానుంది. ఆ తేదీకి రావాల్సిన 'పెద్ది' వాయిదా పడింది. మరి ధనుష్ 'కర'తో హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి? ప్రస్తుతానికి తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగుది కూడా వదులుతారు.
(ఇదీ చదవండి: షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్‌బాస్' ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా)
Tags : 1