Breaking News

మరో వివాదంలో గుడ్ బ్యాడ్‌ ‍అగ్లీ.. లీగల్ యాక్షన్‌ తీసుకుంటానన్న స్టార్ హీరో తండ్రి

Published on Tue, 05/27/2025 - 18:53

కోలీవుడ్ స్టార్ హీరో ‍అజిత్ కుమార్‌ నటించిన సూపర్ హిట్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఏప్రిల్‌ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా అభిమానులను మెప్పించింది. గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.

అయితే తాజాగా ఈ మూవీపై మరో వివాదం మొదలైంది. తన అనుమతి లేకుండా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో మూడు పాటలను ఉపయోగించడంపై నటుడు ధనుశ్ తండ్రి, చిత్రనిర్మాత కస్తూరి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు.  తమ పాటలను అనుమతి లేకుండా సినిమాల్లో ఉపయోగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కస్తూరి రాజా  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన చిత్రాల్లోని మూడు పాటలు - పంజు మిట్థై, ఓథా రూబా థారెన్, తూటువలై ఇలై అరాచి లాంటి పాటలు వినియోగించారని ఆరోపించారు. తన అనుమతి లేకుండా వినియోగించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత తరం చిత్రనిర్మాతలు, సంగీత దర్శకులు తమ వాస్తవికతను కోల్పోయారని ఆయన విమర్శించారు.

కస్తూరి రాజా మాట్లాడుతూ.. 'ఇళయరాజా, దేవా వంటి దిగ్గజాల స్ఫూర్తితో సంగీతాన్ని సృష్టించాలి. కానీ ఈ రోజుల్లో సంగీత స్వరకర్తలు ఆవిష్కరణ కంటే ఉన్నవాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పాత ట్రాక్‌లను ఉపయోగించడం సమస్య కాదు. కానీ అసలు సృష్టికర్తల నుంచి అనుమతి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎవరూ అలా చేయడం లేదు. త్వరలోనే చట్టపరమైన చర్య తీసుకుంటా' అని తెలిపారు.

(ఇది చదవండి: ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్)

ఇళయరాజా రూ.5 కోట్ల డిమాండ్..

కాగా.. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఓథా రూబా థారెన్ పాటను ఉపయోగించారు. సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఇళయరాజా తన మూడు పాటలను సినిమాలో అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపారు. రూ. కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. అంతేకాకుండా సినిమా నుంచి తన పాటలను తొలగించాలని కోరారు. 

మరోవైపు గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళయరాజా పాటలను ఉపయోగించినప్పుడు తాము ఎటువంటి తప్పు చేయలేదని చిత్రాన్ని  మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవిశంకర్  అన్నారు. మేము సినిమాలో ఉపయోగించిన పాటలకు అవసరమైన అన్ని రకాల అనుమతి తీసుకున్నామని తెలిపారు.  అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో చాలా వరకు పాత పాటల్ని.. వింటేజ్ ఫీల్ కోసం ఉపయోగించారు. 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)