Breaking News

ఖైదీల కోసం స్పెషల్ ప్రీమియర్ షో.. అభినందించిన అధికారులు!

Published on Sun, 10/06/2024 - 13:11

కమెడియన్ ధన్‌రాజ్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న తాజా చిత్రం 'రామం రాఘవం'. ఆయనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని తండ్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు.

ఇటీవల అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చర్లపల్లి సెంట్రల్ జైలులో స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు. జైలులోని దాదాపు 2500 ఖైదీల కోసం సినిమాను జైలులోనే ప్రదర్శించడం విశేషం. ఈ అవకాశం కల్పించిన చర్లపల్లి జైలు అధికారులకు, పోలీస్ విభాగనికి చిత్రయూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఖైదీలతో ఇలాంటి ఒక మంచి అనుభూతిని పొందుతానని కలలో కూడా ఊహించలేదని ధనరాజ్ అన్నారు.

ఈ చిత్రం చూసి ఖైదీలు ఎమోషనల్ అయ్యారు. అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ అధికారులు మమ్మల్ని అభినందించి ఎంకరేజ్ చేసినట్లు ధనరాజ్ తెలిపారు. రామం రాఘవం చిత్ర యూనిట్‌ ఇది మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఖైదీల హృదయాల్ని కదిలించిన రామం రాఘవం చిత్రం ప్రేక్షకులని కూడా మెప్పిస్తుందని చిత్రబంద సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)