Breaking News

అదంతా పీఆర్ స్టంట్.. నోరు విప్పుతానని చాహల్ భయపడ్డారు: ధనశ్రీ వర్మ

Published on Wed, 09/17/2025 - 16:16

ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ టీమిండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను పెళ్లాడారు. 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరు మనస్పర్థలు రావడంతో ఈ ఏడాది తమ బంధానికి ఎండ్ కార్డ్ పడేశారు. ఫిబ్రవరి అఫీషియల్‌గా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి యుజ్వేంద్ర చాహల్ ప్రముఖ ఆర్జే మహ్‌వశ్‌తో డేటింగ్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి.

అయితే ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోన్న చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడాకుల సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. చాహల్‌ను తాను మోసం చేశానంటూ పలు కథనాలొచ్చాయి. తాజాగా వీటిపై ధనశ్రీ వర్మ రియాక్ట్ అయింది. ఇదంతా నెగెటివ్ పీఆర్‌లో భాగంగానే చేశారని విమర్శించింది. ఓ ఎపిసోడ్‌లో మరో కంటెస్టెంట్‌ అర్బాజ్ పటేల్ చాహల్‌ను ధనశ్రీ మోసం చేసిందని తాను విన్నానని ఆమెతో చెప్పాడు.

దీనిపై ధనశ్రీ స్పందిస్తూ.. 'అలాంటి వాళ్లు నా గురించి ఇలాంటి చెత్త మాటలు వ్యాప్తి చేస్తారు. నేను నోరు తెరుస్తానేమోనని భయపడుతున్నాడు. నా నోరు మూయించడానికే ఇదంతా చేస్తున్నారు. ‍అసలేం జరిగిందో నిజమైన వివరాలు చెబితే.. ఈ షో మీకు మరోలా అనిపిస్తుంది. ఆర్జే మహ్‌వశ్‌తో రిలేషన్‌పై ధనశ్రీ మాట్లాడింది. నాకు చాహల్‌తో విడాకులు అయిపోయాయి. అతని గాసిప్స్ గురించి నాకు అక్కర్లేదు. నా లైఫ్‌లో అదొక ముగిసిన అధ్యాయం. పెళ్లి అనే బంధంలో ఉన్నప్పుడు బాధ్యాతాయుతంగా ఉండాలి. ఇతరుల గౌరవాన్ని కూడా మనం కాపాడేలా వ్యవహరించాలి. మన ఇమేజ్ కోసం మరొకరిని ఎందుకు తక్కువ చేయాలి? మీరు నా గురించి ఎంత నెగెటివ్‌గా మాట్లాడినా దాంతో మీకెలాంటి ఊపయోగం లేదు. మీ టైమ్ వేస్ట్ తప్ప' అని పంచుకుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)