Breaking News

ఆ హీరో నా కన్నకొడుకు, కానీ మా మధ్య ఏ బంధమూ లేదు: నటుడి షాకింగ్‌ కామెంట్స్‌

Published on Sun, 09/10/2023 - 13:20

అరవింద్‌ స్వామి.. ఈయన పేరు చెప్పగానే రోజా, బాంబే, ధృవ సినిమాలు గుర్తొస్తాయి. మొదటి రెండు సినిమాల్లో హీరోగా చేసిన ఈయన తర్వాతి కాలంలో విలన్‌గా మారాడు. సినిమాల్లోనే కాకుండా బిజినెస్‌లోనూ పేరు ప్రఖ్యాతలు గడించిన ఆయన తండ్రి ఎవరంటే చాలామంది వెంకటరామ దొరై స్వామి పేరు చెప్తారు. కానీ అరవింద్‌ స్వామి అసలు తండ్రి సింగం నటుడు డిల్లీ కుమార్‌. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు.

అరవింద్‌ నా కన్న కొడుకు
అరవింద్‌ తన కన్నకొడుకు అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. 'అరవింద్‌ స్వామి నా కొడుకు. కానీ మా మధ్య తండ్రీకొడుకుల బంధమనేదే లేదు. అతడు పుట్టగానే నా చెల్లెలికి దత్తత ఇచ్చాను. అప్పటి నుంచి అరవింద్‌ ఆ కుటుంబంలోని వ్యక్తిగానే పెరిగాడు. ఏదైనా ప్రధానమైన ఫంక్షన్స్‌ ఉంటే మాత్రమే నా ఇంటికి వచ్చేవాడు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవాడు. మేమిద్దరం తండ్రీకొడుకుల అనుబంధాన్ని పెంచుకోలేదు అని చెప్పుకొచ్చాడు.

కెరీర్‌ తొలినాళ్లలోనే నిజం చెప్పేసిన హీరో
కాగా అరవింద్‌ స్వామి దళపతి సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశాడు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో తమిళంలో మెట్టియోలి అనే సీరియల్‌ ప్రసారమైంది. ఇందులో డిల్లీ కుమార్‌ నటించాడు. ఆ సమయంలో అరవింద్‌ స్వామి తన తండ్రి డిల్లీ కుమార్‌ అని ప్రకటించాడు. తర్వాత ఎక్కడా తన తండ్రి గురించి ప్రస్తావించలేదు. అంతేకాదు, వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎక్కడా కనిపించలేదు.

ఇన్నాళ్లకు పెదవి విప్పిన నటుడు
వీరు ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోకపోవడమే కాకుండా ఎక్కడా కలిసి నటించకపోవడం గమనార్హం. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అరవింద్‌ గురించి ఓపెన్‌గా మాట్లాడాడు డిల్లీ కుమార్‌. కథ కుదిరితే అరవింద్‌తో నటించేందుకు కూడా సిద్ధమేనంటున్నాడు. ఇకపోతే అరవింద్‌ను వి.డి.స్వామి-వసంత దంపతులు దత్తత తీసుకుని పెంచుకున్నారు.

చదవండి: ఓటీటీలో భోళా శంకర్‌.. ఐదు భాషల్లో ఈ వారమే స్ట్రీమింగ్‌..

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)