Breaking News

జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ పిటిషన్లు.. హైకోర్ట్ కీలక ఆదేశాలు.!

Published on Mon, 12/22/2025 - 16:31

సెలబ్రిటీలు వరుసగా తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ తారలు పిటిషన్స్‌ వేయగా.. అదే బాటలో టాలీవుడ్ హీరోలు నడుస్తున్నారు.  ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్,పవన్ కల్యాణ్ తమ  వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లు వేశారు. తమ ఫోటోలు వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం ,తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

వీరిద్దరి పిటిషన్లపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. పవన్ కళ్యాణ్,జూనియర్ ఎన్టీఆర్  తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. తప్పుడు వార్తలు,మార్ఫింగ్ ఫోటోలతో అవమానకరంగా  పోస్టులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఫ్లిప్ కార్ట్,అమెజాన్, ఎక్స్,గూగుల్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ‍అయితే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. తొలగించని లింకులపై ఆదేశాలు జారీ చేసేముందు వినియోగదారుడి వాదనలు వినాలని  కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాలో పోస్టులు అని ఇన్‌స్టాగ్రామ్ ప్రత్యేకంగా స్పష్టం చేయాలని కోర్టు సూచించింది. ఈ విషయాన్ని గూగుల్ తమ ఖాతాదారులకు తెలియజేయాలని .. లేదా ఖాతాను నిలిపివేయాలని హైకోర్టు తెలిపింది. వీటికి సంబంధించిన బీఎస్‌ఐ, ఐపీ అడ్రస్‌లు, లాగిన్ వివరాలు 3 వారాల్లో అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)