Breaking News

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ధర్మేంద్రకు కోర్టు సమన్లు

Published on Tue, 12/10/2024 - 11:43

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ధర్మేంద్ర వల్ల మోసపోయానంటూ ఒక వ్యాపారి చేసిన ఫిర్యాదుతో ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. గరం ధరమ్ ధాబా ఫ్రాంచైజీ కేసుకు సంబంధించి ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సమన్లు ​​జారీ చేసింది. ‘గరం ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెట్టించి తనను తప్పుదోవ పట్టించారని ఢిల్లీ వ్యాపారవేత్త సుశీల్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) యశ్‌దీప్ చాహల్ సమన్లు ​​జారీ చేశారు.

2018 ఏప్రిల్ నెలలో, ఉత్తరప్రదేశ్‌లోని NH-24/NH-9లో గరం ధరమ్ ధాబా  ఫ్రాంచైజీ ఇస్తామని ధర్మేంద్ర తనను సంప్రదించినట్లు సుశీల్‌ కుమార్‌ తెలిపారు. ఆయన మాటలు నమ్మి తాను రూ.63లక్షల వరకు పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు.  ఢిల్లీ, హర్యానా వటి నగరాల్లో ఈ రెస్టారెంట్ బ్రాంచ్‌లు సుమారుగా  రూ. 70 నుంచి 80 లక్షల వరకు నెలవారీ టర్నోవర్‌ను ఆర్జిస్తున్నాయని ఆశ చూపించడంతో తాను కూడా ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టడానికి ఆకర్షితుడయ్యానని తెలిపారు. 

ఆ సమయంలో ఒప్పంద పత్రంపై సంతకాలు కూడా చేశారన్నారు. ఈ ప్రక్రియ ముగుసిన తర్వాత ధర్మేంద్ర నుంచి ఎలాంటి  స్పందన రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం తాను మోసపోయానని గ్రహించి ‌ కోర్టును ఆశ్రయించినట్లు సుశీల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని ఆయన వాపోయారు.

‘గరం ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీ కేసులో భాగంగా ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీ అయ్యాయి.  420, 120B సెక్షన్ల కింద వారికి సమన్లు ​​పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసు 2025 ఫిబ్రవరి 20 విచారణ జరగనుందని కోర్టు వాయిదా వేసింది.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)