Breaking News

తెలుగులో ఎప్పుడో నటించిన దీపికా.. ఆమె ఆస్తి ఎంతో తెలుసా?

Published on Sun, 06/29/2025 - 09:23

బ్యాడ్మింటన్‌ కోర్టు వదిలేసి, మోడలింగ్‌ ప్రపంచంలో నాజూకు అడుగులతో మొదలుపెట్టింది. నేడు వెండితెర మీద తనదైన సామ్రాజ్యం నిర్మించుకుంది నటి దీపికా పదుకొణే. ఇప్పుడు కాస్త గ్యాప్‌ తీసుకొని త్వరలో రాబోతుండటంతో, ఎక్కడ చూసినా ఆమె పేరే ఒక హాట్‌ టాపిక్‌! అల్లు అర్జున్‌ – అట్లీ కాంబినేషన్‌లో రూపొందే సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేయడం సినీ పరిశ్రమలో పెద్ద వార్తగా మారింది. ఆమె గురించి కొన్ని విషయాలు మీకోసం..

బ్యాడ్మింటన్‌ ఆట నుంచి..
దీపికా పదుకొణె (Deepika Padukone) కొంకణి అమ్మాయి. ఆమె తండ్రి ప్రకాశ్‌ పదుకొణే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు. తండ్రి ప్రభావంతో బ్యాడ్మింటన్‌ ఆడిన దీపికా, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. కాని తనకు సినిమా, మోడలింగ్‌పై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో నటన వైపు మొగ్గుచూపింది. ఆమె సినీ ప్రయాణం తెలుగు సినిమా ‘మన్మథుడు’ ఆధారంగా రూపొందిన కన్నడ రీమేక్‌ ‘ఐశ్వర్య’ చిత్రంతో మొదలైంది. 

తెలుగులో ఎప్పుడో యాక్ట్‌ చేసింది
తెలుగు దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ, దీపికాకు తెలుగులో మొదటి అవకాశం ఇచ్చారు. ఓ యువ ప్రేమకథలో ప్రత్యేక పాటలో నాట్యం చేసింది. ఆ సినిమా పూర్తయింది. కానీ, ఇప్పటికీ విడుదల కాలేదు. లేకపోతే ఆమె టాలీవుడ్‌లో ఎప్పుడో అడుగుపెట్టేది. ‘కల్కి’ సినిమాలో సుమతి పాత్రతో ఆకట్టుకున్న దీపికా, ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

గ్లామర్‌లో తగ్గేదేలే
‘రామ్‌ లీలా’ సినిమా చిత్రీకరణ సమయంలో రణ్‌వీర్‌ సింగ్‌తో పరిచయం ప్రేమగా మారింది. అంతకు ముందు రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో ఉన్న ఆమె, ఆ బ్రేకప్‌ తర్వాత కొత్త జీవితం మొదలుపెట్టింది. పెళ్లి అయినా, తల్లి అయినా, దీపికా తన గ్లామర్‌ను తగ్గించుకోలేదు. తన పని పట్ల నిబద్ధతతో ప్రవర్తించేది. హిందీ సినీ ప్రపంచంలో ఆమె తొలి సినిమా ‘ఓం శాంతి ఓం’, షారుఖ్‌ ఖాన్‌తో కలసి నటించింది. ఆ చిత్రం ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘హ్యాపీ న్యూ ఇయర్‌’, ‘పఠాన్‌’, ‘జవాన్‌’లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది.

రూ.500 కోట్లకు పైగా ఆస్తులు
హాలీవుడ్‌లోనూ నటించే అవకాశం పొందిన దీపికా, ప్రపంచ సినీరంగంలో కూడా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం దీపికా ఆస్తుల విలువ దాదాపు రూ.500 కోట్లకు పైగా ఉంది. ముంబైలో ఆమెకు అంధేరి, బాంద్రా, ప్రభాదేవి ప్రాంతాల్లో మూడు ఇళ్లు ఉన్నాయి. 2022లో ఆమె సొంతంగా సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇళ్లపై పెట్టుబడులు పెట్టడాన్ని ఆమె ఇష్టంగా భావిస్తుంది.

రహస్యాన్ని అతడికే చెప్తా
ఓ ఇంటర్వ్యూలో తల్లి అయ్యాక, తన పాత్రల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నానని, బిడ్డకు సమయాన్ని ఇచ్చేలా ప్రయత్నిస్తున్నానని చెప్పింది. ఓ కార్యక్రమంలో ‘ఒక రహస్యాన్ని చెవిలో చెప్పాలంటే ఏ హీరోకి చెబుతారు?’ అన్న ప్రశ్నకు వెంటనే షారుఖ్‌ ఖాన్‌ అని బదులిచ్చింది. 2007లో రణ్‌బీర్‌ కపూర్‌తో పరిచయం, ప్రేమగా మారింది. ఒకే మేకప్‌ ఆర్టిస్ట్‌ కారణంగా ఫోన్‌ నంబర్లు మార్చుకుని ప్రేమలో పడ్డారు. తన మెడ వెనక అతడి పేరు టాటూ వేయించుకుంది. కాని, ఏడాదిలోనే బ్రేకప్‌ జరిగింది.

డిప్రెషన్‌
రణ్‌బీర్‌ కపూర్‌ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం వల్ల విడిపోయినట్లు ఓ సందర్భంలో దీపిక చెప్పింది. దీని వలన డిప్రెషన్‌కు లోనైనా, కెరీర్‌పై ప్రభావం రాకుండా చూసుకుంది. ‘ఏ జవానీ హై దివానీ’ సినిమా అదే సమయంలో పూర్తి చేసింది. ఇప్పుడు ఇద్దరూ ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. దీపికా – రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది. మరోవైపు రణ్‌బీర్‌ కపూర్‌ – ఆలియా భట్‌ను వివాహం చేసుకుని పాపకు తండ్రయ్యాడు. ఇప్పటికీ వీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రొఫెషనల్‌గానే పలకరించుకుంటారు.

చదవండి: స్క్విడ్‌ గేమ్‌ 3 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్‌, అందరికీ రుచిస్తుందా?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)