Breaking News

విపరీతంగా ఏడ్చేదాన్ని.. అందుకే నిజం దాచిపెట్టా: దీపిక

Published on Sat, 03/01/2025 - 14:20

కొన్నేళ్ల ముందు వరకు సినీ తారలు తమ అనారోగ్య సమస్యల గురించి పెద్దగా బయటపెట్టేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారింది. మానసిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు. తమ అనుభవాల్ని కూడా చెబుతున్నారు. 'కల్కి' ఫేమ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా తన మానసిక కుంగుబాటు గురించి మరోసారి ఓపెన్ అయింది.

'2014లో కెరీర్‌ పరంగా మంచి ఫామ్ లో ఉన్నా. సినిమాలు చేస్తూ నచ్చినట్లు బతుకున్నా. ఓరోజు ఎందుకో బాగా అలసట అనిపించింది. పనివల్ల ఇలా జరుగుంటుంది అనుకున్నా కానీ ఓ రోజు కళ్లుతిరిగి పడిపోయాను. అనవసరమైన వాటికి విపరీతంగా ఏడ్చేదాన్ని. నేను నాలా ఉండలేకపోయాను. అమ్మతో కలిసి థెరపిస్ట్ దగ్గరికే వెళ్తే నాకు డిప్రెషన్ ఉన్నట్లు అర్థమైంది'

(ఇదీ చదవండి: కూతురి ఫోటోల్ని డిలీట్‌ చేసిన ఆలియా భట్‌! ఆ కారణం వల్లే!)

'అయితే థెరపిస్ట్ దగ్గరకు వెళ్లినా దాని గురించి ఎవరికీ చెప్పాలనుకోలేదు. అందుకే సీక్రెట్ గా థెరపీ చేయించుకున్నా. కోలుకుంటున్నప్పుడు మాత్రం మానసిక ఆరోగ్యం గురించి అందరికీ చెప్పాలనుకున్నాను. అలా నా సమస్య గురించి బయటపెట్టాను' అని దీపిక పదుకొణె చెప్పింది.

రీసెంట్ గా ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో పాల్గొన్న దీపికా.. మానసిక ఆరోగ్యం గురించి విద్యార్థులకు చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది కల్కి, సింగం ఎగైన్ మూవీస్ చేసింది. కూతురు పుట్టడంతో ఆమె ఆలనాపాలనా చూసుకుంటోంది.

(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు')

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)