Breaking News

దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. తొలి ఇండియన్‌గా రికార్డు

Published on Thu, 07/03/2025 - 11:18

బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ 2026’కు ఆమె ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తాజాగా హాలీవుడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధికారికంగా వెల్లడించింది. వినోదరంగంలో గణనీయంగా కృషి చేసినందుకుగాను ప్రతి ఏటా హాలీవుడ్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ ’ జాబితాను వెల్లడిస్తుంది. ఈ ఏడాది మోషన్‌ పిక్చర్స్‌ విభాగంలో దీపికను ఎంపిక చేసినట్లు హాలీవుడ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వెల్లడించింది. 

ఈ జాబితాలో డెమి మూర్‌, రాచెల్‌ మెక్‌ఆడమ్స్‌, ఎమిలీ బ్లంట్‌ వంటి హాలీవుడ్‌ తారలతో పాటు మొత్తం 35 మంది ఉన్నారు. భారత్‌ నుంచి ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌’ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా దీపిక చరిత్ర సృష్టించింది. బాలీవుడ్‌ అగ్రతారలు అయిన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌ కూడా ఈ జాబితాలో స్థానం పొందలేకపోవడం గమనార్హం.

2006లో ఉపేంద్ర హీరోగా నటించిన  కన్నడ సినిమా ఐశ్వర్యతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది దీపిక. ఆ తర్వాత షారుఖ్‌ ఖాన్‌ నటించిన బాలీవుడ్‌ మూవీ  ఓం శాంతి ఓం తో మంచి గుర్తింపు సంపాదించుంది. 2017లో త్రిబుల్‌ ఎక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ సినిమాలో హాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. కల్కి 2898 ఏడీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ -అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)