Breaking News

దానికంటే ముందు చాలా సినిమాలు రిజెక్ట్‌ చేశా!

Published on Sat, 11/15/2025 - 14:31

'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించింది దీపికా పదుకొణె (Deepika Pdukone). తక్కువకాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. అయితే ఓం శాంతి ఓం కంటే ముందు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయని, వాటన్నింటినీ తాను వదిలేసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ.. కొన్నిసార్లు మనం చూస్తుండగానే అన్నీ జరిగిపోతుంటాయి. నేను రెండేళ్లు మోడల్‌గా చేశాను. 

రెడీగా లేను
అప్పటినుంచే సినిమా ఛాన్సులు రావడం మొదలైంది. చాలామంది దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు. కానీ, అప్పటికి నేను సిద్ధంగా లేను. గ్లామర్‌ ప్రపంచంలో మోడల్‌గా అప్పుడే కదా కెరీర్‌ ప్రారంభించాను. ఇక్కడినుంచి సినిమాలకు షిఫ్ట్‌ అవడానికి ఇంకాస్త సమయం తీసుకోవాలనుకున్నాను. అందువల్లే నాకు వచ్చిన ఆఫర్లను ఎంతో సున్నితంగా రిజెక్ట్‌ చేశాను. నన్ను నమ్మి ఛాన్సులిచ్చిన అందరికీ నేనెంతో కృతజ్ఞురాలిని.

ఎప్పుడూ నేర్చుకుంటూనే..
ఓం శాంతి ఓం ఆఫర్‌ చేసినప్పుడు ఇదే కరెక్ట్‌ టైం అనిపించి సెట్‌లోకి అడుగు పెట్టాను. ర్యాంప్‌ వాక్‌ అయినా, యాక్టింగ్‌ అయినా.. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండేదాన్ని.  ఇండస్ట్రీని, కళను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఇప్పటికీ సెట్‌లో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. కాకపోతే గతంలో కంటే ఇప్పుడు నేను ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నాను. అప్పుడు నేను చేసేది కరెక్టేనా? జనాలు ఏమనుకుంటారు? ఇలాంటి ఆలోచనలుండేవి. 

సినిమా
కానీ, ఇప్పుడు నాకు నచ్చింది చేస్తున్నా.. నాకు నచ్చినట్లే ఉంటున్నా అని చెప్పుకొచ్చింది. దీపికా.. ఓం శాంతి ఓం సినిమా కంటే ముందు కన్నడలో ఐశ్వర్య అనే మూవీ చేసింది. తర్వాత మళ్లీ సాండల్‌వుడ్‌లో కనిపించనేలేదు. ఈమె తెలుగులో కల్కి 2898 ఏడీ సినిమా చేసింది. అయితే కొన్ని ప్రత్యేక డిమాండ్లు చేసిందన్న కారణంతో కల్కి సీక్వెల్‌ నుంచి ఆమెను తప్పించారు. అలాగే ప్రభాస్‌ స్పిరిట్‌ మూవీలోనూ నటించే ఛాన్స్‌ వచ్చినప్పటికీ సడన్‌గా ఆ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌- అట్లీ, షారూఖ్‌ ఖాన్‌ 'కింగ్‌' సినిమాలు చేస్తోంది.

చదవండి: సస్పెన్స్‌కు బ్రేక్‌.. వీడియో షేర్‌ చేసిన తెలుగు సీరియల్‌ నటి

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)