Breaking News

ఎవరెంత రెచ్చగొట్టినా అలాగే ఉంటా: దీపికా పదుకొణె

Published on Sat, 02/28/2026 - 14:57

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె వరుసగా పెద్ద సినిమాల నుంచి తప్పుకుంటూనే ఉంది. స్పిరిట్‌, కల్కి 2 నుంచి దీపికా సైడ్‌ అయిన విషయం తెలిసిందే! తాజాగా ప్రముఖ హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ ది వైట్‌ లోటస్‌లో యాక్ట్‌ చేసే అవకాశాన్ని కూడా వదిలేసుకున్నట్లు ఓ వార్త వైరలవుతోంది.

హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ నుంచి అవుట్‌
ది వైట్‌ లోటస్‌ నాలుగో సీజన్‌ కోసం మేకర్స్‌ దీపికను సంప్రదించారట! అయితే ఈ ప్రాజెక్ట్‌లో నటించాలంటే ఆడిషన్‌ తప్పనిసరి అని టీమ్‌ చెప్పిందట. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న తనకు ఆడిషన్‌ ఏంటన్న భావనతో దీపికా ఈ ఛాన్స్‌ను వదిలేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీపిక తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టింది. 

అరవడం పెద్ద విషయం కాదు
ప్రశాంతంగా ఉండటమే అన్నింటికంటే గొప్ప వరం. సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడటం పెద్ద విషయం కాదు. దానికి ఎటువంటి శక్తి, బలం అవసరం లేదు. కానీ ఎన్ని గందరగోళ పరిస్థితులు తలెత్తినా ఏమాత్రం చలించకుండా ఉండటంలోనే అసలైన బలం దాగి ఉంది. మన చుట్టూ ఎంత డ్రామా జరుగుతున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కావాలని మనల్ని రెచ్చగొడుతున్నా స్థబ్ధుగా, ప్రశాంతంగా ఉండాలి, భావోద్వేగాలను బయటకు కనిపించనివ్వకూడదు. 

ఎప్పుడూ ఏదో ఒక గొడవ
ఎంతో కృషి చేస్తే తప్ప ఇదంతా సాధ్యం కాదు. ప్రశాంతంగా ఉండటం అనేది బలహీనత కాదు. అదొక శక్తి. మనమేంటనేది ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి స్పందించాల్సిన పని అంతకన్నా లేదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవలు, వివాదాలు, అర్థంపర్థం లేని విషయాలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో మనం వాటికి చలించకుండా కూల్‌గా ఉండటమే అన్నింటికంటే పెద్ద సూపర్‌ పవర్‌ అని దీపికా పదుకొణె రాసుకొచ్చింది.

చదవండి: హీరోలు రిజెక్ట్‌ చేశారు.. వాళ్ల వల్లే: తాప్సీ

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)