Breaking News

దేనికీ భయపడను, ఎవరికీ తలవంచను: దీపికా పదుకొణె

Published on Wed, 10/01/2025 - 13:01

తానెన్నడూ భయపడిందే లేదంటోంది స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone). కష్టతరమైన మార్గంలోనూ దర్జాగా నడిచానని, ప్రశ్నించేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయలేదని పేర్కొంది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎమ్‌డీబీ (IMDB) 25 ఏళ్ల భారతీయ సినిమా (2000-2025) అంటూ 130 అత్యుత్తమ చిత్రాల జాబితాను రిలీజ్‌ చేసింది. అందులో 10 చిత్రాల్లో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించడం విశేషం.

కష్టాలదారిలోనే నడిచా..
ఈ అరుదైన ఘనత అందుకోవడంపై దీపిక సంతోషం వ్యక్తం చేసింది. అలాగే రెండు పెద్ద సినిమాలైన స్పిరిట్‌, కల్కి 2లు చేజారడంపైనా పరోక్షంగా కామెంట్లు చేసింది. ఈ మేరకు తన జర్నీ గురించి దీపిక మాట్లాడుతూ.. నటిగా ప్రయాణం ప్రారంభించిన కొత్తలో నేనెలా ఉండాలి? ఏం చేస్తే సక్సెస్‌ అవుతానని నాకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవారు. అయితే కెరీర్‌ ప్రారంభం నుంచే నేను ముక్కుసూటిగా ఉన్నాను. ఏదైనా తప్పనిపిస్తే ప్రశ్నించేందుకు వెనకడుగు వేయలేదు. కష్టాలదారిలోనే కొనసాగాను, నాకెదురైన పరిస్థితులను సవాల్‌ చేస్తూ ముందడుగు వేశాను తప్ప ఎక్కడా తలవంచలేదు.

నా తర్వాత వచ్చేవారికోసం..
నా కుటుంబసభ్యులు, అభిమానులు నాపై ఉంచిన నమ్మకమే నేను తీసుకునే బలమైన నిర్ణయాలకు కారణం. నా తర్వాత వచ్చేవారు అనుసరించే మార్గాన్ని నేను శాశ్వతంగా మారుస్తానని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. బహుశా 8 గంటల షిఫ్ట్‌ గురించే ఆమె పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే దీపికా ప్రస్తుతం షారూఖ్‌ ఖాన్‌తో కలిసి కింగ్‌ మూవీ చేస్తోంది. అలాగే అల్లు అర్జున్‌-అట్లీ మూవీలోనూ యాక్ట్‌ చేస్తోంది.

చదవండి: విడాకులు తీసుకున్న జీవీ ప్రకాశ్‌-సైంధవి

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)