Breaking News

ఆ హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు: దీపికా పదుకొణె

Published on Fri, 10/10/2025 - 11:11

స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) కొంతకాలంగా వివాదాల్లో నానుతూనే ఉంది. కల్కి 2, స్పిరిట్‌ వంటి రెండు పెద్ద సినిమాల్లో భాగమైన ఆమె.. అనూహ్యంగా వాటినుంచి సైడ్‌ అయిపోయింది. కారణం తను పెట్టిన కండీషన్లే! 8 గంటల పనిదినాలతో పాటు రెమ్యునరేషన్‌ కూడా భారీగా డిమాండ్‌ చేసిందని, తనతో పాటు తన టీమ్‌ మొత్తానికి వానిటీ వ్యాన్లు, లగ్జరీ హోటల్స్‌లో వసతులు కల్పించాలని షరతులు పెట్టినట్లు ప్రచారం జరిగింది.

భారీ సినిమాలు చేజార్చుకున్న దీపికా
స్టార్‌ హీరోయిన్‌ కాబట్టి అన్నింటికీ తలాడించిన నిర్మాతలు 8 గంటల పనిదినాల దగ్గర మాత్రం ఒప్పుకోవడానికి నిరాకరించారు. భారీ బడ్జెట్‌ సినిమాల విషయంలో ఈ రూల్‌ పని చేయదు. అది పాటిస్తే బడ్జెట్‌ చేయిదాటిపోతుందన్నది వారి వాదన! అందుకే ఆమె చేతినుంచి సినిమాలు చేజారుతున్నాయి. తాజాగా తొలిసారి దీపికా పదుకొణె మీడియా ముందు ఈ వివాదంపై పెదవి విప్పింది. 

స్టార్‌ హీరోలు 8 గంటలే..
ఆమె మాట్లాడుతూ.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది సూపర్‌స్టార్స్‌, టాప్‌ హీరోలు ఎన్నో ఏళ్లుగా 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. ఇదేమీ సీక్రెట్‌ కాదు. అయినా ఎప్పుడూ ఈ విషయం వార్తల్లోకెక్కలేదు. వాళ్ల పేర్లు నేను చెప్పను. ఇప్పుడుకానీ వాళ్ల పేర్లు ప్రస్తావిస్తే విషయం పెంటపెంట అవుతుంది. అందుకే ఆ హీరోల గురించి చెప్పాలనుకోవడం లేదు. చాలామంది హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేస్తారు, వీకెండ్‌లో సెలవు తీసుకుంటారు. 

నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నా..
ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన కొందరు హీరోయిన్లు కూడా 8 గంటలే వర్క్‌ చేయడం ప్రారంభించారు. కానీ, వాళ్ల గురించి ఎవరూ మాట్లాడరు. నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదు అని చెప్పుకొచ్చింది. ప్రభాస్‌- సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్‌ మూవీలో మొదట దీపికను అనుకున్నారు. కానీ, సడన్‌గా తన స్థానంలోకి త్రిప్తి డిమ్రి వచ్చి చేరింది. కల్కి 2898 ఏడీ సినిమాలో దీపిక నటించిన విషయం తెలిసిందే! ఈ మూవీ సీక్వెల్‌లో  నిబద్ధతతో పనిచేసేవారు అవసరమంటూ దీపికను తప్పించారు.

చదవండి: ఇలాగైతే నావల్ల కాదు, ఇంటికి పంపించేయండి.. సంజనా ఏడుపు

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)