Breaking News

నాకు స‌పోర్ట్ చేసేందుకు ఆ హీరో భార్య ఒప్పుకోలేదు

Published on Sat, 05/04/2024 - 17:21

దీప‌క్ తిరోజి.. ఆషిఖి, ఖిలాడీ, జో జీతా వోహి సిఖింద‌ర్‌, ఘులామ్‌, బాద్‌షా వంటి హిందీ చిత్రాల్లో స‌హాయ‌క పాత్ర‌ల‌తో గుర్తింపు పొందాడు. పెహ్లా న‌షా మూవీతో హీరోగానూ మారాడు. ఊప్స్ చిత్రంతో ద‌ర్శక‌నిర్మాత‌గా అవ‌తారం ఎత్తాడు. ఆయ‌న చివ‌ర‌గా 2018లో వ‌చ్చిన టామ్, డిక్ అండ్ హ్యారీ 2 అనే సినిమాకు డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

అతిథి పాత్ర‌లో
దాదాపు ఆరేళ్ల త‌ర్వాత టిప్సీ చిత్రంతో మ‌రోసారి ద‌ర్శ‌కుడిగా మారాడు. ఈ మూవీ మే 10న విడుద‌ల కానుంది. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చిన‌ దీప‌క్ ఓ ఆస‌క్తిక‌ర‌ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. '1993లో జరిగిందీ సంఘ‌ట‌న‌.. అప్పుడు నేను పెహ్లా న‌షా సినిమా చేస్తున్నాను. ఆ మూవీలో అందరు సెల‌బ్రిటీలు అతిథి పాత్ర‌లో క‌నిపించాల్సి ఉంది. షారుక్‌, సైఫ్ అలీ ఖాన్‌, ఆమిర్ ఖాన్‌.. అంద‌రూ ఒప్పుకున్నారు. 

చిన్న‌పాటి సీన్
షూటింగ్ కోసం సైఫ్ ఇంటి ద‌గ్గ‌ర రెడీ అవుతున్న‌ప్పుడు అత‌డి భార్య అమృత (ప్ర‌స్తుతం విడాకులు తీసుకున్నారు) ఎక్క‌డికి వెళ్తున్నార‌ని అడిగింది. అందుకాయన దీప‌క్ సినిమా కోసం వెళ్తున్నాను. చిన్న‌పాటి సీన్ చేసి వ‌స్తాన‌ని చెప్పాడు. అందుకామె ఆశ్చర్య‌పోతూ నిజంగానే మీరందుకు ఒప్పుకున్నారా?  మేమైతే అలాంటి ప‌నులు ఎప్పుడూ చేయ‌లేదు. 

నిజానికి ఆ స‌మ‌యంలో..
ఇలా ఒకరికి స‌పోర్ట్ చేసేందుకు ఎవ‌రైనా వెళ్తారా?  అని ఆగ్ర‌హించింది. నిజానికి ఆ స‌మ‌యంలో అందరూ ఒక‌రికి ఒక‌రు స‌హాయం చేసుకున్నారు. ఇప్పుడైతే అలాంటి ప‌రిస్థితులు పెద్ద‌గా క‌నిపించ‌డ‌మే లేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక పెహ్లా న‌షా సినిమాలో షారుక్‌, సైఫ్‌తో పాటు ర‌వీనా టండ‌న్‌, పూజా భ‌ట్‌, ప‌రేశ్ రావ‌ల్, జూహీ చావ్లా, సుదేశ్ బెర్రీ ఇలా త‌దిత‌రులు న‌టించారు.

చ‌ద‌వండి: ఓటీటీలో 100 సినిమాలు.. ఎంచ‌క్కా ఇంట్లోనే చూసేయండి

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)