Breaking News

'ఐబొమ్మ' రవికి జాబ్‌ ఆఫర్‌.. క్లారిటీ ఇచ్చిన డీసీపీ

Published on Fri, 12/05/2025 - 10:57

పైరసీ సినిమాలతో ఆరేళ్లపాటు సినీ పరిశ్రమతో పాటు పోలీసులను కూడా ముచ్చెమటలు పట్టించిన ఐబొమ్మ రవి కొద్దిరోజుల క్రితమే అరెస్ట్‌ కావడం జరిగింది. పోలీసులు విచారణలో ఇప్పటికే అతను సంచలన విషయాలను తెలిపాడు. ఏవిధంగా నెట్‌వర్క్‌ను హ్యాక్‌ చేయగలడొ పోలీసులకు చూపించాడు. పలు వెబ్‌సైట్స్‌తో పాటు కొత్త  సినిమా శాటిలైట్‌ పిన్‌ వంటి వాటిని సులువుగా హ్యాక్‌ చేయగలనని తెలిపాడు. దీంతో రవికి పోలీసులు జాబ్‌ ఆఫర్‌ చేశారని వార్తలు వచ్చాయి. అయితే, ఇదే అంశంపై తాజాగా  సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు స్పందించారు.

ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేశామని వచ్చిన వార్తలు నిజం కాదని సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు క్లారిటీ ఇచ్చారు. అవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలేనని పేర్కొన్నారు. ఐబొమ్మ రవికి తాము ఎలాంటి జాబ్ ఆఫర్ చేయలేదని డీసీపీ తెలిపారు. 8 రోజుల కస్టడీలో రవి కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పాడని ఆయన అన్నారు.  తప్పు చేశాననే  బాధ రవిలో అసలు కనిపించలేదన్నారు.  అతను 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు తాము గుర్తించామని ఆయన పేర్కొన్నారు. రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని  సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)