Breaking News

శ్రీజ ఎలిమినేషన్‌ .. సర్ఫ్ ఎక్సెల్‌తో కడిగినా సరే మరక పోదు.. ఇలా అవమానిస్తారా?

Published on Tue, 10/14/2025 - 12:44

బిగ్‌బాస్‌ 9 నుంచి దమ్ము శ్రీజ ఎలిమినేషన్‌ గురించి సోషల్‌మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. ఆడియన్స్‌ ఓట్స్‌తో సంబంధం లేకుండా ఆమెను హౌస్‌ నుంచి పంపించేయడంతో షో పట్ల విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్‌లలో శ్రీజ చాలా స్ట్రాంగ్‌ అని షో చూస్తున్న వారికి ఎక్కువగా అభిప్రాయం ఉంది. టోటల్లీ అన్‌ఫెయిర్ బిగ్‌బాస్ అంటూ కొందరు.. ఇదంతా దొంగాట అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

వాస్తవంగా శ్రీజ ఆట మొదటి రెండు వారాలు పరమ చెత్తగా ఉండేది. అయితే, ప్రియ ఎలిమినేషన్‌ తర్వాత తన పంతా పూర్తిగా మార్చేసుకుంది. ఒక శివంగిలా  ప్రతి టాస్క్‌లలో దూసుకుపోయింది. ఎదురుగా  ఎంత మంది ఉన్నా సరే సమాధానం చెబుతుంది. ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంటుగా తనను తాను మార్చుకుంది. కానీ, హౌస్‌లోకి కొత్తగా  అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీల అభిప్రాయంతో  ఆమెను తరిమేయడం ఏంటి అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. హౌస్‌లోకి వచ్చిన ఆరుగురిలో నలుగురు శ్రీజ వద్దు అనగానే ఇలా పంపించేయడం ఏంటి..? అలాంటప్పుడు ఓట్లు, పోల్స్‌, వీకెండ్‌లో నాగార్జున షో ఎందుకు అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. 

ప్రజాభిప్రాయం అనేది లేనప్పుడు ఈ షో ఎందుకు అంటూ  బిగ్‌బాస్‌ను తప్పుబడుతున్నారు. బిగ్‌బాస్‌లోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆమె జర్నీని కూడా చూపించకుండా చాలా అవమానకరంగా ఇలా గెంటేయడం ఏంటి దుమ్మెత్తిపోస్తున్నారు. సర్ఫ్ ఎక్సెల్‌తో కడిగినా సరే బిగ్‌బాస్‌ చరిత్రలో ఈ మరక పోదని అంటున్నారు. మా ఇష్టం వచ్చిన వాల్లను ఇంటికి పంపించేస్తామనే దోరణిలో తెలుగు బిగ్‌బాస్‌ ఉంది. కేవలం రేటింగ్‌ కోసమే కామనర్స్‌ను తీసుకున్నారా..  ఏడుగురు హౌస్‌లోకి వెళ్తే ఇప్పటికే నలుగురు ఇంటి బాట పట్టించారు.  కనీసం శ్రీజకు రీఎంట్రీ ఛాన్స్‌ ఇచ్చి హౌస్‌లోకి రప్పించాలని , అలాగైన బిగ్‌బాస్‌ తన గౌరవాన్ని కాపాడుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నా‍రు.

రీఎంట్రీపై దమ్ము శ్రీజ కామెంట్‌
శ్రీజ ఎలిమినేషన్‌ వంద శాతం  కావాలనే చేశారని ఎవరైనా చెబుతారు. దీంతో ఆమె రీ ఎంట్రీ కోసం చాలా సోషల్‌ మీడియా ఖాతాలు ఓటింగ్‌ పెట్టాయి. ప్రతి దానిలో ఆమె రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలోనే రీ ఎంట్రీ  గురించి ఆమె ఇలా మాట్లాడారు. దేవుని దయ వల్ల రీ ఎంట్రీ వుంటే తప్పకుండా హౌస్‌లోకి వెళ్తాను. నా కోసం ఇంత సపోర్ట్‌ ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. సామాన్యులకు హౌస్‌లోకి వెళ్లేందుకు అవకాశం ఇచ్చిన బిగ్‌బాస్‌కు ధన్యవాదాలు.  నేను ఎలిమినేషన్‌ అవుతానని కూడా ఊహించలేదు. సీక్రెట్‌ రూమ్‌ ఉంటుంది అనుకున్నాను. ఎప్పుడైతే నన్ను బజ్‌ ప్రోగ్రామ్‌కు పంపించారో అర్థం అయింది. సడెన్‌గా తీసుకున్న నిర్ణయం వల్ల నా జర్నీని కూడా టెలికాస్ట్‌ చేయలేదు. అని శ్రీజ అన్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)