Breaking News

బిగ్‌బాస్‌ కోసం జాబ్‌ వదిలేశాను.. కన్నీళ్లు పెట్టుకున్న శ్రీజ

Published on Sun, 10/19/2025 - 10:50

బిగ్‌బాస్‌ 9 నుంచి దమ్ము శ్రీజను ఎలిమినేషన్‌ పేరుతో కావాలనే హౌస్‌ నుంచి పంపించేశారని ప్రేక్షకుల అభిప్రాయం. దీంతో రీఎంట్రీ కోసం ఆమెకు మద్ధతు కూడా తెలిపారు. అయితే, బిగ్‌బాస్‌ మనసు మాత్రం కరగలేదు. తనకు నచ్చిన వారిని మాత్రమే హౌస్‌లో ఉంచుతాననే సంకేతాన్ని ఈ సీజన్‌తో బిగ్‌బాస్‌ ఇచ్చేశాడు. దీంతో ఈ షో అంతా ఒక ఫేక్‌ అంటూ ఓట్లేసిన వారే అంటున్నారు. తమ ఓటింగ్‌తో సంబంధం లేకుండా శ్రీజను ఎలా ఎలిమినేట్‌ చేస్తారని ఫైర్‌ అయ్యారు. అయితే, ఎన్నో ఆశలతో బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన శ్రీజ మాత్రం ఇప్పటికీ ఆ ట్రామా నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. తాజాగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో షేర్‌ చేసింది.

శ్రీజ తండ్రి విశాఖ మున్సిపాలిటీ 92వ వార్డులో పారిశుధ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. చిన్న తనం నుంచే కష్టాలతో పెరిగిన శ్రీజ కూడా చాలా కష్టపడి చదవి ఉన్నత చదువులు పూర్తి చేసింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా నెలకు రెండు లక్షలకు పైగా జీతంతో ఉద్యోగం సాధించింది. అయితే, ఇండస్ట్రీ మీద ఉన్న ఫ్యాషన్‌తో బిగ్‌బాస్‌ వైపు అడుగులేసింది.  అందులో ఛాన్స్‌ రాగానే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. కానీ, బిగ్‌బాస్‌ మాత్రం ప్రేక్షకుల ఓటింగ్స్‌తో సంబంధం లేకుండా ఆమెను హౌస్‌ నుంచి పంపించేశాడు. దీంతో ఆమె జీవితంలో తీరని నష్టాన్ని బిగ్‌బాస్‌ మిగిల్చాడని చెప్పవచ్చు.

ఉద్యోగం కూడా వదిలేశాను: శ్రీజ
బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన తర్వాత ఇప్పటికీ కూడా నేను ఒక్క ఎపిసోడ్‌ చూడలేదు. దీపావళి సెలబ్రేషన్స్‌ టైమ్‌లో హౌస్‌లో నేను ఉండాల్సింది కదా అనిపిస్తుంది. అగ్నిపరీక్ష దాటుకునేందుకు చాలా కష్టపడ్డాను. 5 లెవల్స్‌ దాటుకొని అక్కడి వరకు చేరుకున్నాను. బిగ్‌బాస్‌ కోసం  ఒక పర్మినెంట్‌ టాటూ కూడా చేతిపై వేయించుకున్నాను. ఈ షో కోసం నా జాబ్‌ను కూడా వదులుకున్నాను. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక గెలుపు కోసం వంద శాతం ప్రయత్నం చేసిన సరే లక్‌ కలిసిరాలేదు. ఎలిమినేషన్‌ రౌండ్‌లో కూడా ప్రతి టాస్క్‌లో చివరి వరకు వెళ్లాను. కానీ, గెలుపు మాత్రం దక్కలేదు. ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్‌ సీజన్స్‌లో  కూడా నా మాదిరి ఎవరూ ఎలిమినేట్‌ కాలేదు. 5వారాలు హౌస్‌లో ఉన్నా కూడా ఒక జర్నీ లేకుండానే బయటకు వచ్చేశాను. అని కన్నీళ్లు పెట్టుకుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)