Breaking News

సల్మాన్ ఖాన్ ఓ గూండా.. బాలీవుడ్ దర్శకుడు సంచలన కామెంట్స్

Published on Mon, 09/08/2025 - 13:08

బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకడు. దాదాపు 7-8 ఏళ్ల నుంచి ఇతడు సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ పడట్లేదు. అలాంటిది ఇతడిపై ఓ బాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సల్మాన్ ఓ గుండా, అతడికి నటన అంటే అసలు ఆసక్తి లేదు. సెలబ్రిటీ హోదా కోసమే మూవీస్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

తెలుగులో 'గబ్బర్ సింగ్' మూవీ పెద్ద హిట్. దాని ఒరిజినల్ చిత్రం 'దబంగ్'. 2010లో రిలీజైన ఈ హిందీ సినిమాకు అభినవ్ కశ్యప్ దర్శకుడు. ఇతడు అనురాగ్ కశ్యప్‌కి అన్నయ్య. అయితే సల్మాన్‍‌తో ఈ మూవీ చేసిన తర్వాత అభినవ్.. ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోయాడు. అయితే దీనికి సల్మాన్, అతడి కుటుంబమే కారణమని గతంలోనే అభినవ్ ఆరోపించాడు. ఇప్పుడు మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు.

'2010లో 'దబంగ్' సీక్వెల్ చేయమని సల్మాన్ కుటుంబం నన్ను అడిగింది. దానికి నేను నో చెప్పాను. అప్పటినుంచి నాపై పగ పెంచుకున్నారు. సల్మాన్‌కి నటనపై ఆసక్తి లేదు. 25 ఏళ్లుగా అతడు నటించడం లేదు. సెలబ్రిటీగా ఉండటానికే సెట్‌కి వస్తాడు. అతడొక గూండా. పగ-ప్రతీకారంతో రగిలిపోయే ఓ అసభ్యకరమైన వ్యక్తి. వారు చెప్పిన మాట కాదంటే వెంటాడి మరీ వేధిస్తాడు. వారందరూ రాబందులు. సల్మాన్ మాత‍్రమే కాదు బోనీ కపూర్ కూడా అలాంటోడే. నా తమ్ముడు అనురాగ్‌తో బోనీ అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే అతడి సినిమా నుంచి అనురాగ్ బయటకొచ్చేశాడు. ఈ రాబందుల గురించి ముందే నా తమ్ముడు చెప్పాడు' అని అభినవ్ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పాడు.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు సినిమా)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)