రిలీజ్‌కి ముందే 'కూలీ' వసూళ్ల రికార్డ్

Published on Tue, 08/12/2025 - 10:51

రజినీకాంత్ 'కూలీ' సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే తమిళనాడుతో పాటు ఓవర్సీస్‌లో జోరుగా బుకింగ్స్ సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా టికెట్ రేట్ల పెంపు జీవో రావాల్సి ఉంది. అయితే రిలీజ్‌కి ముందే ఈ చిత్రం క్రేజీ రికార్డ్ సొంతం చేసుకుంది. తమిళనాడు నుంచి ఈ రికార్డ్ సృష్టించిన తొలి సినిమాగానూ నిలిచింది.

రజిని సినిమా అంటే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లోని కొన్ని దేశాల్లో కాస్త బజ్ ఉంటుంది. కానీ 'జైలర్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ హీరో చేసిన మాస్ మూవీ కావడం, దానికి లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్, అనిరుధ్ మ్యూజిక్.. ఇలా చాలా ఎలిమెంట్స్ కారణంగా హైప్ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓవర్సీస్‌లో సినిమా విడుదలకు ముందే 2 మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించి, పోస్టర్ విడుదల చేసింది.

(ఇదీ చదవండి: ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ పరమేశ్వరన్)

అప్పట్లో రజినీ 'కబాలి' రిలీజ్ టైంలో చాలా హడావుడి నడిచింది. ఇదే ఓవర్సీస్‌లో ప్రీ సేల్స్ 1.6 మిలియన్ డాలర్స్ వరకు వచ్చాయి. తర్వాత చాలా తమిళ చిత్రాలు వచ్చాయి కానీ ఏవి కూడా ఈ మార్క్‌ని అందుకోలేకపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు రజినీకాంత్ తన 'కూలీ'తో ఈ నంబర్ దాటేశారు. చూస్తుంటే తొలిరోజు వసూళ్లలో సరికొత్త రికార్డ్ నంబర్స్ నమోదు కావడం గ్యారంటీ అనిపిస్తుంది.

'కూలీ'లో రజినీకాంత్‌కి హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. నాగార్జున విలన్ కాగా సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌పై రజిని అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఫలితం ఏమవుతుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: ఇదెక్కడి విడ్డూరం.. 'కూలీ, 'వార్ 2'తో తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?)

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)