Breaking News

కానిస్టేబుల్‌ సందేశం

Published on Mon, 09/01/2025 - 00:03

‘‘కానిస్టేబుల్‌’ సినిమా కంటెంట్‌ నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. వరుణ్‌ సందేశ్‌ తన పాత్రలో ఒదిగిపోయి ఉంటాడని భావిస్తున్నాను’’ అని అన్నారు రాజేంద్రప్రసాద్‌. వరుణ్‌ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వంలో ‘బలగం’ జగదీష్‌ నిర్మించిన థ్రిల్లర్‌ చిత్రం ‘కానిస్టేబుల్‌’. ఆదివారం హైదరాబాద్‌లో చిత్రయూనిట్‌  ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌ ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేసి, మాట్లాడారు. వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు ఆర్యన్‌ ఈ సినిమా కథ చెప్పినప్పుడు కానిస్టేబుల్‌ క్యారెక్టర్‌ను ఊహించుకుని, చేయగలననే నమ్మకం ఏర్పడిన తర్వాతే ఈ సినిమా చేశాను’’ అని చెప్పారు. ‘‘ఒక వ్యక్తికి అవమానం జరిగినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందనే అంశానికి సందేశాన్ని మిళితం చేసి, ఈ చిత్రం చేశాం’’ అని పేర్కొన్నారు ‘బలగం’ జగదీష్‌.

‘‘ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉండగా, ఒక పాటను చంద్రబోస్‌గారు, మరో పాటను గద్దర్‌ నర్సన్న పాడారు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సినిమా ఇది’’ అని చెప్పారు ఆర్యన్‌ సుభాన్‌. ‘‘మన భద్రత కోసంపోలీస్‌వారు అహర్నిశలూ ఎంతో శ్రమ పడుతున్నారు. ఇలాంటి అంశాలతో తీసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అని అన్నారు తెలంగాణ కల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, నటుడు శివారెడ్డి. ఈ కార్యక్రమంలో ముగ్గురు కానిస్టేబుల్స్‌ను యూనిట్‌ సత్కరించింది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు