Breaking News

గుడిలో కమెడియన్‌ పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే!

Published on Mon, 06/10/2024 - 10:48

ప్రముఖ తమిళ దర్శకుడు గంగై అమరన్‌ రెండో కుమారుడు, నటుడు ప్రేమ్‌జీ 45 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కాడు. తిరుత్తణి మురుగన్‌ సాక్షిగా తన ప్రేమికురాలు ఇందు మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆదివారం (జూన్‌ 9న) నిరాడంబరంగా జరిగిన వివాహ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా ప్రేమ్‌జీ.. సేలం నగరానికి చెందిన బ్యాంకు ఉద్యోగి ఇందును కొన్నేళ్లగా ప్రేమిస్తూ వచ్చాడు. 

గుడిలో సింపుల్‌గా పెళ్లి
వీరి ప్రేమకు ఇరుకుటుంబాలు పచ్చజెండా ఊపాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు తమిళనాడు తిరువళ్లూరులోని తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి సాక్షిగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు సినీ తారలు రావడంతో తిరుత్తణి ఆలయంలో సందడి నెలకొంది. వారిని చూసేందుకు, సెల్పీ దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. గంగై అమవరన్‌, అతడి పెద్ద కుమారుడు, సినీ దర్శకుడు వెంకట్‌ప్రభు సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. 

కమెడియన్‌ ప్రేమ్‌జీ పెళ్లి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

పీటలపై ప్రియురాలికి ముద్దు
తన ప్రేమికురాలు జీవిత భాగస్వామి కావడంతో ప్రేమ్‌జీ పెళ్లిపీటలపైనే ఇందును ముద్దాడి తన ఆనందాన్ని పంచుకున్నాడు. అనంతరం నూతన దంపతులు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందారు. వివాహ వేడుకల్లో సినీ నటులు శివ, జయ్‌, వైభవ్‌, సంతాన భారతి, కార్తీక్‌రాజ, సంగీత, గాయకులు ఎస్‌పీబీ. చరణ్‌, క్రిష్‌ సహా ప్రముఖులు పాల్గొన్నారు.

చదవండి: కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న నిమిషా సజయన్‌.. నిజమేనా?

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)