Breaking News

ప్రముఖ కమెడియన్ మంచి మనసు.. ఏకంగా లక్షల సాయం

Published on Mon, 05/13/2024 - 15:02

ప్రముఖ తమిళ హాస్య నటుడు అప్పుకుట్టి మంచి మనసు చాటుకున్నాడు. తాను చదివిన పాఠశాలకు రూ.11 లక్షలు విరాళం ఇచ్చి, తన ఔదార్యం చాటుకున్నాడు. అప్పుకుట్టి స్వస్థలం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా నాథన్‌ కినరు. ఆ ప్రాంతంలోని ముత్తారమ్మన్‌ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు అప్పుకుట్టి వెళ్లాడు. వేడుకల సందర్భంగా నాథన్‌ కినేరులోని తాను చదువుకున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్)

గ్రామ ప్రజల కోరిక మేరకు అప్పుకుట్టి.. రూ.11 లక్షల ఖర్చుతో టేబుల్, కంప్యూటర్, టీవీ విద్యుత్‌ ఫ్యాన్‌లు, తదితర వస్తువులను కొని ఇచ్చాడు. దీని గురించి అప్పుకుట్టి మాట్లాడాడు. ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాను ఒకటి, రెండు తరగతులు చదివానని, అయితే ఇక్కడ కనీస వసతులు లేకపోవడంతో చదివే విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగానే ఉందన్నారు. ఈ క్రమంలోనే పాఠశాలకు అవసరమైన సామగ్రి అందించానని అన్నాడు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని అప్పుకుట్టి కోరాడు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మనం ఊరి బయట ఉన్నా, ఏడాదికి కొన్ని రోజులు ఊరిలోనే నివాసం ఉండాలని అప్పుకుట్టి తన అభిప్రాయం వెలిబుచ్చారు.

(ఇదీ చదవండి: AP Assembly Election 2024: ఎన్టీఆర్‌ షర్ట్‌పై నెట్టింట రచ్చ!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)