Breaking News

అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్‌ అలీ

Published on Tue, 05/31/2022 - 07:47

Comedian Ali Comments On F3 Movie In Success Meet: ‘‘ఎఫ్‌ 3’ చిత్రం తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్స్‌కు వస్తున్నారు’’ అని వెంకటేశ్‌ తెలిపారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌ 3’. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం (మే 30) ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ జరిగాయి.

‘‘ఈ చిత్రాన్ని ఎలాంటి ఫ్రస్ట్రేషన్‌ లేకుండా తీశారు అనిల్‌ రావిపూడి. థియేటర్‌లో పిల్లలు కూడా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అన్నారు వరుణ్‌ తేజ్‌. ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘భీమ్లానాయక్‌’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్‌ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని అనిల్‌ రావిపూడి పేర్కొన్నారు.



‘‘45 ఏళ్లుగా నవ్వునే నమ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలా ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ చేశాను. ప్రపంచంలోని నలుమూలల నుంచి నాకు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ‘మీ పాత సినిమాలు గుర్తుకు వస్తున్నాయి’ అని అభినందిస్తున్నారు. నాకు నా ‘మాయలోడు’ సినిమా గుర్తొచ్చింది’’ అన్నారు రాజేంద్రప్రసాద్‌. ‘‘హిట్టయిన సినిమాను కూడా బాగాలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది సరి కాదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారనే విషయానికి ‘ఎఫ్‌ 3’ సక్సెస్‌ ఓ నిదర్శనం’’ అని తెలిపారు అలీ.  

చదవండి: నేను సింగిల్‌, కాదు మింగిల్‌.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్‌

Videos

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

అనకాపల్లి జిల్లా టీడీపీ మహానాడు సభ అట్టర్ ఫ్లాప్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

మళ్లీ అదే తీరు దక్షిణాఫ్రికా అధ్యక్షుడి రమఫొసాతో ట్రంప్ వాగ్వాదం

స్కామ్ స్టార్ బాబు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన YS జగన్ మోహన్ రెడ్డి

అదే జరిగితే టీడీపీ క్లోజ్..!

పవన్ సీజ్ ద షిప్ పై జగన్ మాస్ ర్యాగింగ్..

రసవత్తరంగా సాగుతున్న మిస్ వరల్డ్ పోటీలు

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)