Breaking News

సీఎం సినిమాకే తప్పని తిప్పలు.. షోలు ఆపేసి మరీ

Published on Mon, 07/27/2026 - 13:43

తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయ‍గన్'.. గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళనాడులో మాత్రం అభిమానులు థియేటర్లకు వెళ్తున్నారు. అయితే చెన్నైలోని పలు థియేటర్లలో ఈ మూవీ షోలని మధ్యలోనే నిలిపివేయడంతో గందరగోళం నెలకొంది.

(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)

వయలెన్స్ ఉందనే కారణంతో ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్.. ఏ సర్టిఫికెట్ ఇ‍చ్చింది. అయినా సరే కొందరు ప్రేక్షకులు తమతోపాటు చిన్న పిల్లల్ని కూడా థియేటర్లకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం చెన్నైలోని పలు మల్టీప్లెక్స్‌ల్లో జరిగిన పోలీసుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఇది రూల్స్‌కి విరుద్ధం కావడంతో షోలు ఆపేశారు.

ఈ క్రమంలోనే పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులని థియేటర్లలో నుంచి బయటకు పంపేందుకు దాదాపు గంట పట్టింది. ఫలితంగా కొన్నిచోట్ల షోలు ఆలస్యమయ్యాయి. మరోసారి నిబంధనలని గుర్తుచేస్తూ మైనర్లతో వచ్చేవాళ్లని మల్టీప్లెక్స్‌ల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశాయి.

తెలుగు సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్‌గా దీన్ని తీశారు. అసలైన పాయింట్ తీసుకుని మిగతాది అంతా యాక్షన్‌తో నింపేశారని, దీంతో వరస్ట్‌గా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజవ్వాలి కానీ సెన్సార్ సమస్యలని దాటుకుని గత వీకెండ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

(ఇదీ చదవండి: నా కథ, స్క్రీన్‌ప్లే దొంగిలించారు)

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)