Breaking News

సినీ కార్మికులు vs నిర్మాతలు.. ప్రస్తుతం ఏం జరుగుతోంది?

Published on Wed, 08/06/2025 - 07:55

టాలీవుడ్‌లో ప్రస్తుతం సినీ కార్మికుల సమ్మె జరుగుతోంది. తమకు 30 శాతం మేర జీతాలు పెంచి ఇవ్వాలని వర్కర్క్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి. దీనికి నిర్మాతలు ఒప్పుకోవట్లదు. ఇప్పటికే సరిపడా ఇస్తున్నామని, ఇకపై పెంచేది లేదని అంటున్నారు. అలానే యూనియన్‌తో సంబంధం లేకుండా ఎవరైనా పనిచేయొచ్చని నోటిఫికేషన్ ఇచ్చారు. అలానే చిరంజీవి కూడా ఈ సమస్యలోకి ఎంటరయ్యారు. ఇంతకీ అసలెం జరుగుతుంది? ప్రస్తుత పరిస్థితేంటి?

(ఇదీ చదవండి: రష్మీతో మనస్పర్థలు.. నిజం బయటపెట్టిన అనసూయ)

వర్కర్క్ యూనియన్స్ వేతనాలు పెంచామని నిర్మాతల్ని కోరుతున్నాయి. నిర్మాతలు మాత్రం ససేమిరా అంటున్నారు. మరోవైపు వేతనాల పెంపునకు అంగీకరించిన 6, 7 సినిమాల షూటింగ్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ పంచాయితీ.. చిరంజీవి దగ్గరకు చేరింది. మంగళవారం సాయంత్రం నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సి కళ్యాణ్, మైత్రీ రవి, ఛాంబర్ సెక్రటరీ దామోదరప్రసాద్ తదితరులు చిరంజీవితో సమావేశమయ్యారు. తమ వెర్షన్ విన్నవించారు. ఇదంతా విన్న చిరు.. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతోనూ చర్చించనున్నారు.

రెండు రోజుల్లో చర్చల్లో పురోగతి రాని పక్షంలో ఇరువర్గాలతో మరోసారి చర్చించనున్నారు. ఇప్పటికే వేతనాల పెంపు కోసం కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు చర్చలు జరిపారు. డిమాండ్స్ ఒప్పుకోకపోతే షూటింగ్స్‌కి వెళ్లేది లేదని కార్మికులు అంటున్నారు. మరోవైపు కార్మికుల బెదిరింపులకు భయపడమని నిర్మాతలు అంటున్నారు. వీళ్లు రాకపోతే కొత్త వాళ్లతో షూటింగ్స్‌ చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు భేటీ కానున్నారు. చిరంజీవి జోక్యంతో సినీ కార్మికుల సమ్మె పరిష్కారం అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ పంచాయితీ ఎప్పటికి తేలుతుందో?

(ఇదీ చదవండి: ఇల్లు కట్టిస్తానని సోనూసూద్ మాటిచ్చారు: షిఫ్ వెంకట్ కూతురు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)