ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
కుడివైపు గుండె.. నీలం రంగు శరీరం.. 'చిరంజీవి' గ్లింప్స్
Published on Mon, 04/20/2026 - 15:08
తెలుగులో ప్రయోగాత్మక సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు కూడా 'చిరంజీవి' పేరుతో ఓ సినిమా తీశారు. ఇందులో డెక్స్ట్రోకార్డియా అనే వ్యాధి.. హీరోకు ఉంటుంది. అంటే ఎడమ వైపు ఉండాల్సిన గుండె.. కుడివైపు ఉంటుందనమాట. దీని వల్ల అప్పుడప్పుడు శరీరంలోని ఆక్సిజన్ లెవల్స్ హెచ్చుతగ్గులు అవుతుంటాయి. అలా జరిగినప్పుడల్లా బాడీ నీలం రంగులోకి మారిపోతుంటుంది. ఈ మేరకు తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)
అయితే హీరోకి ఆక్సిజన్ సరిపోక స్పృహ తప్పి పడిపోయినప్పుడు హీరోయిన్ ఇచ్చి ముద్దుపెట్టి ఆక్సిజన్ అందించడం మాత్రం కాస్త సినిమాటిక్గా అనిపించింది. చివరలో మళ్లీ హీరోకి కుడివైపు కాదు ఎడమవైపే గుండె ఉంది అన్నట్లు చిన్న సస్పెన్స్ పెట్టడం ఆసక్తికరంగా అనిపించింది. గ్లింప్స్ అయితే బాగానే ఉంది గానీ పూర్తి మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. హీరోహీరోయిన్, దర్శకుడు, నిర్మాత అందరూ కొత్తవాళ్లే కావడం విశేషం.
(ఇదీ చదవండి: విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం)
#Chiranjeevi glimpse out now
https://t.co/x0YvdWKISJ— Suresh PRO (@SureshPRO_) April 20, 2026
Tags : 1