అధికారిక ప్రకటన.. 'వాల్తేరు వీరయ్య' కాంబో మరోసారి

Published on Fri, 08/22/2025 - 17:29

'భోళా శంకర్' వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఆ సినిమా ఫలితం వల్ల ఆలోచనలో పడిపోయిన చిరంజీవి రూట్ మార్చారు. 'విశ్వంభర' మొదలుపెట్టారు. అయితే ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడంతో లేట్ అవుతూ వస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నారు. దీనికి 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలానే శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ మూవీ కమిట్ అయ్యారు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

(ఇదీ చదవండి: లండన్ నుంచి చెన్నై వచ్చి..దళపతి విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?)

రెండో ఇన్నింగ్స్‌లో చిరు సినిమాలు చేస్తున్నారు గానీ సరైన ఫలితాలు రావట్లేదు. ఈ క్రమంలోనే వచ్చి మంచి కమర్షియల్ హిట్ అయిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇప్పుడు మరోసారి చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ బాబీ అందుకున్నాడు. యష్ 'టాక్సిక్', దళపతి విజయ్ 'జననాయగన్' చిత్రాల్ని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్.. చిరు-బాబీ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

'మెగా 158' పేరుని ఈ ప్రాజెక్టుకి వర్కింగ్ టైటిల్‌గా నిర్ణయించారు. నెత్తురు-గొడ్డలిని పోస్టర్‌లో చూపించారు. చూస్తుంటే ఇది యాక్షన్ మూవీలా అనిపిస్తుంది. మరి షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు. హీరోయిన్, సంగీత దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తారేమో?

(ఇదీ చదవండి: చిరంజీవి లుక్‌లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి)

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)