Breaking News

కష్టకాలంలో సమంత నాకు అండగా నిలిచింది : సింగర్‌ చిన్మయి

Published on Sat, 03/04/2023 - 15:18

సింగర్‌ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి ఎక్కువగా సమంత నటించిన సినిమాలకు డబ్బింగ్‌ చెప్పడం ద్వారా పాపులర్‌ అయ్యింది. తొలి సినిమా ఏ మాయ చేశావే నుంచి సమంతకు-చిన్మయికి మంచి అనుబంధం ఉంది. కష్ట​కాలంలో ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్‌గా నిలుచున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిన్మయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

నేను కష్టాల్లో ఉన్నప్పుడు సమంత నాకు అండగా నిలబడింది. ధైర్యాన్నిచ్చింది. మీటూ సమయంలో నేను పని కోల్పోయాను. ఆ సమయంలో సామ్‌ నాకు పని కల్పించింది. నాకు అన్నిరకాలుగా మద్దతు పలికింది అని పేర్కొంది. కాగా మీటూ ఉద్యమ సమయంలో తమిళనాడు సీనియర్‌ రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఆ వివాదంలో కోలీవుడ్‌ ఇండస్ట్రీ చిన్మయిపై బ్యాన్‌ విధించింది. మరోవైపు సమంత తన భర్త నాగచైతన్యతో విడిపోయినప్పుడు చిన్మయి ఆమెకు సపోర్ట్‌గా నిలిచింది. విడాకులకు సమంతను టార్గెట్‌ చేసినప్పుడు చిన్మయి సోషల్‌ మీడియా వేదికగా సమంతకు మద్దతు పలికింది. ఇక ఇటీవలె సమంత మయోసైటిస్‌ బారిన పడిన సమయంలో కూడా చిన్మయి, ఆమె భర్త రాహుల్‌ సమంతకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి ఆమెకు అండగా నిలిచారు.


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)