Breaking News

అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్

Published on Tue, 05/26/2026 - 10:50

హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రస్తుతం పాలనలో బిజీగా ఉన్నారు. అయితే ఈయన ‍స్వతహాగా నటుడే కాబట్టి ఇండస్ట్రీకి అనుకూలించే నిర్ణయాలు తీసుకుంటారని సినీ ప్రముఖులు అంతా భావించారు. ఎవరికి వాళ్లే పలు సూచనలతో విజయ్‌ని ఇదివరకే వెళ్లి కలిశారు కూడా. ఇప్పడు సినీ పరిశ్రమకు మొత్తానికి కలిసొచ్చేలా విజయ్ శుభవార్త చెప్పేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం విజయ్.. ఇండస్ట్రీ గురించి ప్రకటన చేశారు. ఇకపై ఏ తమిళ సినిమా అయినా థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చని పేర్కొన్నారు. 1957 తమిళనాడు థియేటర్ల నియంత్రణ చట్టం నిబంధనలను సవరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం తమిళనాడు వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలు విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు. స్థానిక పండగ రోజులు, ప్రభుత్వ సెలవు దినాలు, శని,ఆదివారాల్లో కూడా రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించడానికి అనుమతి లభించింది.

గత కొన్నేళ్లలో తమిళనాడులో ఏ కొత్త సినిమా అయినా సరే మార్నింగ్ షోతోనే మొదలయ్యేది. బెన్‌ఫిట్ షోలు లాంటివి ఉండేవి కావు. ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం వల్ల స్టార్ హీరోల చిత్రాలకు కలెక్షన్స్ పరంగా కలిసొచ్చే అవకాశముంటుంది. అలానే తెలుగు రాష్ట్రాల్లో ముందురోజు రాత్రి వేసే ప్రీమియర్ల ట్రెండ్ కూడా త్వరలో తమిళనాడులో మొదలైన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఇకపోతే విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగణ్' రిలీజ్ ఎప్పుడనేది ఇంకా తేలట్లేదు. కొన్నిరోజుల క్రితం తమిళనాడులోని ఓ ఆలయాన్ని దర్శించుకున్న ఈ చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ.. ఇంకా సెన్సార్ కాలేదని చెప్పారు. మరోవైపు జూన్ 19న మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే రోజుకు ఐదు షోల నిర్ణయం.. 'జన నాయగణ్'కి ఎక్కువగా లాభించే అవకాశముంటుంది.

(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్‌లో నిషేధం)

Videos

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను

ఆకాశం నుంచి నిప్పుల వాన

నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?

బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్

సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్

పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్

భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి

Photos

+5

వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ సాంగ్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమా టీజర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)

+5

హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు)

+5

మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్

+5

విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)