క్షమాపణలు చెప్పిన 'ఛావా' డైరెక్టర్‌.. ఎందుకంటే?

Published on Mon, 02/24/2025 - 17:46

కొన్ని కథలు వినోదాన్ని పంచితే మరికొన్ని హృదయాలను బరువెక్కిస్తాయి. కొన్ని మాత్రమే మన రక్తం మరిగేలా చేస్తూనే కన్నీళ్ల వరద పారిస్తాయి. అలాంటి సినిమాయే ఛావా (Chhaava Movie). బాలీవుడ్‌ స్టార్‌ విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీగా నటించాడు. ఆయన భార్య ఏసుబాయిగా హీరోయిన్‌ రష్మిక మందన్నా యాక్ట్‌ చేసింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది.

ద్రోహులుగా చిత్రీకరించారు
ఇక ఈ సినిమాలో తన పూర్వీకులను తప్పుగా చూపించారంటూ మరాఠా యోధులు గానోజీ, కాన్హోజి షిర్కే వారసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను ఉటంకిస్తూ తమ పూర్వీకులను శంభాజీ మహారాజ్‌కు ద్రోహం చేసినవారిగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఆయా సన్నివేశాల ద్వారా తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించినందుకుగానూ చిత్రయూనిట్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ (Laxman Utekar)కు నోటీసులు పంపించారు.

అసౌకర్యానికి గురైతే క్షమించండి
ఈ వివాదంపై డైరెక్టర్‌ లక్ష్మణ్‌ స్పందిస్తూ ఛావాలో గానోజి, కన్హోజీల పేర్లు మాత్రమే ఉపయోగించామన్నాడు. వారి ఇంటిపేరు, ఏ ప్రాంతానికి చెందినవారు వంటి వివరాలను వెల్లడించలేదన్నాడు. షిర్కే కుటుంబసభ్యుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. ఛావా వల్ల వారు అసౌకర్యానికి గురైతే తనను క్షమించాల్సిందిగా కోరాడు.

చదవండి: కావాలనే రాంగ్‌ మెడిసిన్‌ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు 

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)