అభిమానులకు గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న ఛావా నటుడు

Published on Thu, 05/01/2025 - 17:02

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఛావా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు వినీత్ కుమార్ సింగ్‌ కీలక పాత్రలో మెప్పించారు.

తాజాగా ఛావా నటుడు వినీత్ కుమార్ సింగ్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. కాగా.. వినీత్ కుమార్ సింగ్ 2021లో నటి రుచిరాను పెళ్లాడారు.

వినీత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ సమయంలో తన భార్య రుచిరాను జాగ్రత్తగా చూసుకోవడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వీలైనంత త్వరగా పని ముగించుకుని ఇంటికి వెళ్తా. నా షెడ్యూల్ నేను నిర్ణయించుకున్నా. ఆమెతో పాటు నేను కూడా డాక్టర్ వద్దకు వెళ్తాను. రాబోయే జూలైలో బిడ్డ పుట్టిన తర్వాత  పితృత్వ సెలవు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా'అని  పంచుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే వినీత్ కుమార్ సింగ్.. ఛావాతో పాటు ఇటీవల విడుదలైన జాట్‌ మూవీతోనూ కనిపించారు. అంతకుముందు 'సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలెగావ్', గుంజన్ సక్సేనా, గుస్పాతియా, మ్యాచ్ ఫిక్సింగ్' లాంటి సినిమాలతో పాటు రంగ్‌బాజ్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు.

 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)