Breaking News

రెబల్ స్టార్‌ బర్త్ డే.. 20 ఏళ్ల నాటి సినిమాను గుర్తు చేసుకున్న ఛార్మి!

Published on Thu, 10/23/2025 - 18:23

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌ డే కావడంతో ఫ్యాన్స్‌ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఇక డార్లింగ్‌ కొత్త సినిమాల అప్‌డేట్స్ సైతం అభిమానులకు డబుల్‌ డోస్‌ ఇచ్చాయి. ఇవాళ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా హనురాఘవపూడితో చేస్తోన్న సినిమాకు సంబంధించి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందరూ ఉహించినట్లుగానే ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్‌కు పలువురు టాలీవుడ్‌ సినీతారలు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియాలో ప్రభాస్‌తో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. తాజాగా హీరోయిన్ ఛార్మి సైతం డార్లింగ్‌కు పుట్టినరోజు విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో నటించిన పౌర్ణమి రీ రిలీజ్‌ కావడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది.

(ఇది చదవండి: ప్రభాస్‌, హను రాఘవపూడి కొత్త సినిమా టైటిల్‌ ప్రకటన)

ఈ  సినిమాలో ప్రతి సీన్‌ ఇప్పటికీ గుర్తుందని రాసుకొచ్చింది. పౌర్ణమి మూవీతో నాకున్న ఉత్తమ జ్ఞాపకాలలో ఒకటని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ సినిమాతో మొదలైన ప్రభుదేవా, త్రిషతో స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని వెల్లడించింది. మా అభిమాన రెబెల్‌స్టార్ ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి విష్ చేసింది. కాగా..2006లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఛార్మి, త్రిష హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. 
 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు