ఓటీటీలోకి 'ఛాంపియన్‌'.. అధికారిక ప్రకటన వచ్చేసింది

Published on Sat, 01/24/2026 - 10:57

యంగ్‌ హీరో రోషన్‌ నటించిన 'ఛాంపియన్‌' సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తాజాగా ప్రకటన వచ్చేసింది. శ్రీకాంత్ తనయుడిగా ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చిన రోషన్‌.. గత ఏడాది డిసెంబర్‌ 25న ఈ మూవీతో తెరపైకి వచ్చాడు.  ఈ సినిమాని ప్రదీప్‌ అద్వైతం తెరకెక్కించగా.. మహానటి, సీతారామం వంటి విజయాల తర్వాత స్వప్న దత్‌ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించలేదు.

ఛాంపియన్‌ సినిమా జనవరి 29న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని ఆ సంస్థ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‌ కానుందని ఒక పోస్టర్‌ను షేర్‌ చేశారు.  సుమారు రూ. 45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ. 17 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రోషన్‌కు జోడీగా అనస్వర రాజన్‌ నటించగా.. సంతోష్‌ ప్రతాప్‌, అవంతిక, కృతి కంజ్‌ సింగ్‌ రాథోడ్‌, హైపర్‌ ఆది తదితరులు కనిపించారు. సంగీతం మిక్కీ జే మేయర్‌ సినిమాకు ప్రదాన ఆకర్షణగా నిలిచింది.

కథేంటి..?
ఈ సినిమా కథంతా 1747-48 ప్రాంతంలో జరుగుతుంది. సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేసే మైఖేల్‌(రోషన్‌)కి ఫుట్‌బాల్‌ ఆట అంటే చాలా ఇష్టం. ఈ ఆటతోనే ఎప్పటికైనా ఇంగ్లాండ్‌ వెళ్లి..అక్కడే సెటిల్‌ అవ్వాలనుకుంటాడు. ఓసారి ఇంగ్లాండ్‌ వెళ్లే అవకాశం వస్తుంది. కానీ అతని తండ్రి చేసిన ఓ పని వల్ల వెళ్లలేకపోతాడు. దొంగమార్గాన ఇంగ్లాండ్‌ వెళ్లాలనుకుంటాడు. దాని కోసం కొన్ని తుపాకులను ఒక చోటుకి తరలించాల్సి వస్తుంది. ఆ పని చేసే క్రమంలో పోలీసుల కంటపడతారు. వారి నుంచి తప్పించుకొని అనుకోకుండా బైరాన్‌పల్లి అనే గ్రామానికి వస్తాడు. అదే ఊరికి చెందిన చంద్రకళ(అనస్వర రాజన్‌)తో  పరిచయం..  నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసిన తిరుగుబాటు రోషన్‌లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? పోలీసు అధికారి బాబు దేశ్‌ముఖ్ (సంతోష్ ప్రతాప్)తో మైఖేల్ గొడవ ఏంటి?   బైరాన్‌పల్లి ప్రజల కోసం మైఖేల్‌ చేసిన త్యాగమేంటి? అనేదే మిగతా కథ. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)