Breaking News

'అల్లు అర్జున్‌ తెలుగు హీరో అనుకోలేదు..' ఛాంపియన్ హీరోయిన్

Published on Sun, 12/21/2025 - 08:13

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న రెండో చిత్రం ఛాంపియన్. ఇటీవలే ట్రైలర్‌ రిలీజ్ చేయగా ఆడియన్స్‌లో అంచనాలు పెంచేసింది. రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ పీరియాడికల్ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా మెప్పించనుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనస్వర రాజన్‌ తెలుగు ఇండస్ట్రీని గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

తెలుగులో తాను చూసిన మొదటి సినిమా రామాయణం ఆధారంగా వచ్చిన శ్రీరామరాజ్యం అని తెలిపింది. మా నానమ్మ ఆ సినిమా చూస్తుంటే చూశానని వెల్లడించింది. అయితే ‍అది తెలుగు మూవీ అని నాకప్పుడు తెలియదని పేర్కొంది. ఆ తర్వాత మలయాళంలో డబ్ చేసిన అల్లు అర్జున్ సినిమాలు ఎక్కువ చూసేదాన్ని అనస్వర రాజన్ తెలిపింది. అప్పుడు అల్లు అర్జున్‌ తెలుగు హీరో అని నాకు తెలియదు.. ఆయనను మలయాళ హీరోనే అనుకున్నానని పంచుకుంది. రామ్ చరణ్ మగధీర సినిమా చూశాకే నాకు తెలుగు చిత్రాలు, యాక్టర్స్ గురించి తెలిసిందని కామెంట్స్ చేసింది. అప్పటి వరకు నేను తెలుగు సినిమాలను చూస్తున్నానని నాకే తెలియదని అన‍స్వర చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో  చంద్రకళ పాత్ర అనే పాత్రలో అలరించనుంది.

కాగా.. ‍అనస్వర రాజన్ ప్రస్తుతం తెలుగులో ఇట్లు మీ అర్జున అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఛాంపియన్‌ కంటే ముందే నేను ఒప్పుకున్న సినిమా ఇదేనని ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది.  కాగా.. ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వంలో ఛాంపియన్ మూవీ తెరకెక్కించారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌పై రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.  ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌ బ్యానర్లపై నిర్మించారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)