DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?
Breaking News
కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియో
Published on Sat, 09/05/2026 - 15:00
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మరో చిత్రం కావడంతో అంచానాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్‌లు, టీజర్ అభిమానులను అలరించాయి. ముఖ్యంగా ఇటీవలే వచ్చిన ఏషనాగుల పాట ఇప్పటికీ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు చాలా మంది రీల్స్ చేస్తూ సోషల్‌మీడియాలో రీపోస్ట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హీరోయిన్ కీర్తి సురేశ్, నాని ఇదే సాంగ్‌ను దసరా సినిమాలోని చమ్కీల సాంగ్‌తో మిక్స్ చేసి ఈ రెండు పాటలపై క్రాస్ ఓవర్ వీడియో చేశారు. అదికాస్త సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ
50 మిలియన్లు దాటిన ఏషనాగుల..
తాజాగా రిలీజైన మాస్ సాంగ్ ఏషనాగుల ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పాట గురించే టాక్ వినిపిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే యూట్యూబ్ వేదికగా 50+ మిలియన్ వ్యూస్ దాటిన తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ సెప్టెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
Tags : 1