Breaking News

నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?

Published on Sat, 04/18/2026 - 15:51

ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న క్రికెటర్ చాహల్, నటి తానియా ఛటర్జీ మధ్య చిన్నపాటి వివాదం నడుస్తోంది. చాహల్ తనకు వ్యక్తిగతంగా మెసేజులు పంపిస్తున్నాడని ఆమె చెప్పడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా చాహల్.. ఈమెపై పరువు నష్టం దావా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది?

(ఇదీ చదవండి: కాళ్లకు మెట్టెలతో రష్మిక కఠిన శిక్షణ.. రోజుకు 8 గంటలకు పైనే!)

స్వతహాగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్ అయిన తానియా ఛటర్జీ.. 'ఫ్లాట్ మేట్స్' అనే ఒక్క సినిమాలో నటించింది. తాజాగా ఈమె మాట్లాడుతూ.. చాహల్ తనకు వ్యక్తిగత మెసేజులు చేసినట్లు స్క్రీన్ షాట్స్ మీడియాకు చూపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు.. చాహల్‌పై విమర్శలు చేశారు. అతడి పీఆర్ టీమ్.. ఈ వీడియోని తీసేయమని కోరారని తానియా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే చాహల్.. ఈమెపై పరువు నష్టం దావా వేశాడు.

దీని గురించి స్పందించిన తానియా.. ఈ విషయంలో తనని మాత్రమే ట్రోల్ చేస్తున్నారని, చాహల్‌ని ఎవరూ ఏం అడగట్లేదని ఆవేదన ‍వ్యక్తం చేసింది. ఇది ఇంతలా వైరల్ అవుతుందనుకోలేదు. నన్నే ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. పరువు పోయింది నాది. కానీ ఇప్పుడు నా మీదే పరువు నష్టం దావా వేశారు. అతడి వ్యక్తిత్వాన్ని నేను తప్పు పట్టాలని అనుకోలేదు. నాకు చాహల్‌పై గౌరవం ఉందని తానియా పేర్కొంది. అయితే ఇదంతా సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఈమె చేస్తోందా? అనే సందేహం కలుగుతోంది.

చాహల్ విషయానికొస్తే గతంలో నటి, ఇన్ఫ్లూయెన్సర్ ధనశ్రీ వర్మని పెళ్లి చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. గతేడాది ఆర్జే మహ్‌వశ్‌తో చాహల్ జంటగా కనిపించాడు. ఇప్పుడు ఆమె కూడా ఇతడికి దూరమైందా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా)

Videos

అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్

ముగ్గువేసి మనసులు గెలిచిన విజయ్

మహిళా బిల్లుపై బాబు కుట్ర ఆధారాలతో బయటపెట్టిన MLC లేళ్ల అప్పిరెడ్డి

అంతా బోగస్.. సుమన్ శెట్టి షాకింగ్ నిజాలు

విజయ్ కి అంత సీన్ లేదు...ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

నాకు ఫీల్డింగ్ పెట్టడం రాదు అంతా రోహితే చూసుకునేవాడు..

మమ్మల్ని హింసించిన వారిని 2029 తరువాత కులం,మతం చూడకుండానే బొక్కలో వేస్తాం

నా రైట్స్ నాకే..! హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

ఆల్కా అదిరిపోయే ఆఫర్ 100 షేర్లు కొంటే 600షేర్లు ఫ్రీ

Photos

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)