పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు: సెలీనా జైట్లీ

Published on Tue, 07/07/2026 - 23:21

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలపై బహిరంగంగా స్పందించింది. సెలీనా ఆస్తులన్నింటినీ తన భర్త పీటర్ హాగ్‌ బదలాయించుకున్నారని ఆమె ఆరోపించింది. తన వైవాహిక బంధం అత్యంత వివాదాస్పదమైంది. దాంతో పెళ్లి చేసుకునే యువతులకు ఒక ముఖ్యమైన సూచన చేసింది. 

సెలీనా జైట్లీ మాటల్లో.. మీకు సొంతంగా ఆస్తులు ఉంటే దయచేసి పెళ్లికి ముందే అతడితో ఓ ఒప్పందం చేసుకోండి. మీ ఆస్తులను ఎప్పుడూ విడిగానే ఉంచుకోండి. ఎందుకంటే చివరికి అంతా ఆస్తుల చుట్టూనే తిరుగుతుందని చెప్పింది. 2010లో ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను సెలీనా వివాహం చేసుకుంది. వీరికి విన్‌స్టన్, విరాజ్, ఆర్థర్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. మరో కుమారుడు షంషేర్ గుండె సమస్యతో చిన్న వయసులోనే మరణించాడు.  


తన 15వ వివాహ వార్షికోత్సవం రోజే విడాకుల పత్రాలు “బహుమతి”గా అందాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా రూ. 20 కోట్ల విలువైన ఆస్తులను హాగ్ తన పేరిట రాయించుకున్నాడు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల్నీ కూడా హాగ్ బదలాయించుకున్నాడని సెలీనా ఆరోపిస్తోంది. ఇక సెలీనా సినీ రంగంలో ఆరేళ్ల విరామం తర్వాత ‘సిస్టర్ నివేదిత’ సినిమాతో బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తోంది. సెలీనా గతంలో తెలుగు, కన్నడ సినిమాల్లోనూ నటించింది.

ఈ సందర్భంలో ఆమె ఇచ్చిన సలహా పెళ్లి చేసుకునే ముందు ముఖ్యంగా సొంత ఆస్తులు ఉన్న యువతులు, తప్పనిసరిగా ప్రీ-నప్షియల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. తద్వారా భవిష్యత్తులో భర్తతో మోసపోకుండా ఉండగలరని సూచించింది.  

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)