Breaking News

‘దేవి’గా శోభిత.. అదరహో అదితిరావ్‌

Published on Mon, 08/03/2026 - 20:45

అద్భుతమైన హస్తకళా నైపుణ్యాన్ని, పెళ్లి దుస్తుల ఫ్యాషన్‌కు, గ్లామర్‌  హుందాతనానికి వేదికగా నిలిచిన ఇండియా కౌచర్‌ వీక్‌ 2026  ముగిసింది. ఈ ఫ్యాషన్‌–గ్లామరస్‌ ఈవెంట్‌లో దేశంలోని అగ్రశ్రేణి డిజైనర్లు  పాల్గొని అద్భుతమైన డిజైన్లతో అహుతులకు కనువిందును అందించారు.

సిటీ టూ ఢిల్లీ...
ఈ ఈవెంట్‌ గత నెల 26న హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రారంభమైంది. ప్రారంభ డిజైనర్‌గా అనామికా ఖన్నా తన డిజైన్లను ప్రదర్శించారు. ఆ తర్వాత ఈవెంట్‌ ఢిల్లీ వేదికగా జులై నెలాఖరు వరకూ కొనసాగింది. రాహుల్‌ మిశ్రా, అర్పితా మెహతా, జెజె వాల్యా...తదితర టాప్‌ స్టార్‌ డిజైనర్స్, బ్రాండ్స్‌ పాల్గొన్న ఈ ఈవెంట్‌లో  ఫ్యాషన్‌  వినోద ప్రపంచానికి చెందిన పలువురు సెలబ్రిటీలు షోస్టాపర్లుగా వ్యవహరించి,  మరింత శోభను చేకూర్చారు. 

ప్రముఖ టాలీవుడ్‌ స్టార్‌ నాగ చైతన్య శ్రీమతి శోభిత ధూళిపాళ హైలెట్‌గా నిలిచారు. ఆమె ప్రముఖ డిజైనర్‌ రాహుల్‌ మిశ్రా «డిజైన్‌ చేసిన దేవి కాన్సెప్ట్‌ కాస్ట్యూమ్స్‌లో అద్భుతంగా మెరిసిపోయారు.

ఈ ఫ్యాషన్‌ వీక్‌లో  హైదరాబాదీ డిజైనర్‌ జయంతి రెడ్డి కి మాత్రమే అవకాశం దక్కింది. నగరానికి చెందిన సెలబ్రిటీ శోభితా ధూళిపాళ ‘దేవి’ అవతారం ఆకట్టుకుంది. అలాగే టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన నవ దంపతులు అదితి రావు హైదరి, సిద్ధార్థ్‌ జంట కూడా   తమదైన ప్రత్యేక ముద్ర వేశారు.

చేనేత వస్త్రాలను చక్కటి ఎంబ్రాయిడరీ తో, అందమైన ఆకృతులతో అద్భుతంగా మేళవించడంలో పేరుగాంచిన నగర డిజైనర్‌ జయంతిరెడ్డి, భారతీయ సంప్రదాయాలతో  ప్రభావితమై, ప్రత్యేక సందర్భాలకు సరిపోయే ఆధునికతను మేళవించిన  వస్త్రధారణలను ప్రదర్శించారు. ఆమె ‘ది గిల్డెడ్‌ ఎరా’ కలెక్షన్, అహుతులను ఆకట్టుకుంది. ఆమె కలెక్షన్‌ను సిద్ధార్థ్, అదితిరావు హైదరిలు ప్రదర్శించారు.

ముఖ్యంగా అదితి రావు హైదరి  షో  వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది. భారతీయ సంప్రదాయాలతో కూడిన జయంతి రెడ్డి  ట్రేడ్‌మార్క్‌ శైలిని ప్రదర్శిస్తూ, ఆమె తన నిగనిగలాడే బంగారు–లేత గోధుమ రంగు దుస్తులలో క్యాట్‌వాక్‌ చేశారు.  

 

ఆమె భుజాల పట్టీలు లేని పెప్లమ్‌ బాడీస్‌పై చెక్కినట్లుగా ఉన్న డిజైన్, లోతైన మెడ భాగం చుట్టూ ఫ్యాన్సీ జర్దోజీ ఎంబ్రాయిడరీ, మెరిసే సీక్వి¯Œ లు సున్నితమైన పూసల పని ప్రతి అడుగుకూ ప్రకాశించాయి. 

సాధారణ లెహంగాకు భిన్నంగా, ఆమె షరారా రూపంలో ఉన్న  పెద్ద స్కర్ట్‌ను ధరించింది. అది స్వేచ్ఛగా కదులుతూ ఆ డ్రెస్‌కు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను ఇచ్చింది. డిజైనర్‌ ’జయంతి రెడ్డి’ కోసం తన భార్య, నటి అదితి రావు హైదరితో కలిసి ర్యాంప్‌పైకి వచ్చిన నటుడు సిద్ధార్థ్, సిల్క్‌ ధోవతితో కూడిన సొగసైన ఐవరీ–బేజ్‌ షేర్వానీని ధరించాడు. ఎంబ్రాయిడరీ  గొప్పతనం ఆ ఎవర్‌గ్రీన్‌  ఫార్మాట్‌ను మరింత అందంగా  ఆధునికంగా కనిపించేలా చేసింది.  ముత్యాలు  పచ్చలతో చేసిన అద్భుతమైన నెక్లెస్‌ను ఆయన ఆభరణంగా ఎంచుకున్నాడు, ఇది మొత్తం లుక్‌కు అవసరమైన రాజసం ఉట్టిపడేందుకు  దోహదపడింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)